కొనసాగుతున్న మున్సిపల్‌ కార్మికుల సమ్మె

Jan 5,2024 21:58
ఫొటో : నిరసన చేపడుతున్న మున్సిపల్‌ కార్మికులు

ఫొటో : నిరసన చేపడుతున్న మున్సిపల్‌ కార్మికులు
కొనసాగుతున్న మున్సిపల్‌ కార్మికుల సమ్మె
ప్రజాశక్తి-కావలి రూరల్‌ : మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మె 11వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సిఐటియు పట్టణ కార్యదర్శి వై.కృష్ణమోహన్‌ మాట్లాడుతూ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తాము అధికారంలోకి వస్తే మున్సిపల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేస్తామని పాదయాత్రలో చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరం దాటినా ఇంతవరకు ఆ హామీని నెరవేర్చలేదని తెలిపారు. మున్సిపల్‌ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని గత 11 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తుంటే వారి సమస్యలను పరిష్కరించక పోగా ప్రయివేట్‌ కార్మికులను తీసుకొచ్చి పనులు చేయించడం, వారిని అడ్డుకున్న కార్మికులు, సిఐటియు నాయకులను అరెస్టు చేయడం, కేసులు మోపడం చాలా దుర్మార్గమైన విషయమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో తురక శీనయ్య, బిడదల మహేష్‌, క్రాంతి, బాబు, రమేష్‌, షానువాజ్‌, మహిళా నాయకులు చిన్నమ్మ, రాజేశ్వరి, అనితతో పాటు మున్సిపల్‌ కార్మికులు పాల్గొన్నారు.

➡️