కోట్నాపల్లి హైవే క్వారీ నిలిపివేత

కోట్నాపల్లి హైవే క్వారీ

జెడ్‌పిటిసి గంగరాజు ఫిర్యాదుకు స్పందించిన అధికారులు

ప్రజాశక్తి-హుకుంపేట: మండలంలోని కొట్నపల్లి హైవే రాయి క్వారీ నిలుపుదల చేస్తూ మైనింగ్‌ అధికారులు చర్యలు తీసుకున్నారని అనంతగిరి సిపిఎం జెడ్‌పిటిసి దీసరి గంగరాజు తెలిపారు. ఈ మేరకు మైనింగ్‌ డిడితోపాటు పాడేరు ఆర్‌ఐ రాంబాబు, ఇతర అధికారుల నుంచి తనకు ఫోనుద్వారా సమాచారం అందిందన్నారు. ఈ సందర్భంగా గంగరాజు మాట్లాడుతూ, కొట్నాపల్లి హైవే వద్ద క్వారీతో పరిసర ప్రాంతాల ప్రజలు దుమ్ముదూళితో పడుతున్న ఇబ్బందులపై విశాఖపట్నం జిల్లా పరిషత్‌ స్థాయి సంఘాల సమావేశంలో ప్రస్తావించడంతోపాటు కొట్నపల్లి హైవే క్వా తో ప్రజలకు జరుగుతున్న నష్టంపై స్థాయీ సంఘం చైర్మన్‌ వరహాసత్యవతి, జెడ్‌పి సిఇఒ పోలినాయుడులకు ఫిర్యాదు చేశానన్నారు. దీనిపై జిల్లా అధికారులు స్పందించి, పాడేరు సబ్‌ కలెక్టర్‌ భావన వశిష్ట ఆదేశాల మేరకు క్వారీ తాత్కలింగా నిలుపుదల చేశామని, మైనింగ్‌ డీడీ, ఇతర అధికారులు ఫోనులో తెలిపారని గంగరాజు తెలిపారు.ప్రజల పక్షాన వారి సమస్యలపై పోరాటానికి సిపిఎం ఎల్లపుడూ అండగా ఉంటుందని గంగారాజు తెలిపారు. కార్యక్రమంలో హుకుంపేట వైస్‌ ఎంపిపి సూడిపల్లి కొండలరావు, సిపిఎం మండల కార్యదర్శి, మెరకచింత మాజీ సర్పంచ్‌ వలసనైని లక్ష్మణరావు, కొట్నాపల్లి సిపిఎం నేతలు పాంగి కేశవరావు, మజ్జి బాలకృష్ణ, గొల్లోరి అప్పలస్వామి, పాంగి సుమన్‌ పాల్గొన్నారు.

మాట్లాడుతున్న సిపిఎం జెడ్‌పిటిసి గంగరాజు

➡️