‘కోడ్‌’ను పకడ్బందీగా అమలు చేయాలి

పల్నాడు జిల్లా: ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ అయిన నేపథ్యంలో జిల్లాలో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ పగడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ సంబంధిత ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు. సోమ వారం నరసరావుపేటలోని కలెక్టర్‌ కార్యా లయంలోని వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశ మందిరం నుండి ఎన్నికల రిటర్నింగ్‌ అధి కారులు, మండల అధికారు లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.ఎన్నికల ప్రవర్తన నియమాలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటా మని, వాలంటీర్లు ఎవరైనా ఎన్నికల విధు లలో ఉన్నట్లయితే వారిని విధుల నుండి తొలగిస్తామని చెప్పారు. ప్రభుత్వ కార్యా లయాల్లో ఉన్న పోస్టర్లను వెంటనే తొల గించాలని, దిన పత్రికలలో వచ్చే ప్రతి కూల వార్తలపై ఎప్పటికప్పుడు నివేదికలు రూపొందించి తగిన చర్యలు తీసుకోవా లని అన్నారు. సి విజిల్‌ యాప్‌ ను ప్రతి ఒక్కరు డౌన్లోడ్‌ చేసుకోవాలని, ఈ యాప్‌లో వచ్చిన అంశాలను 100 నిముషాలలో సంబం ధిత అధికారుల ద్వారా శీఘ్రమే పరిష్కరిం చేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి రిట ర్నింగ్‌ అధికారి వారి కార్యా లయం ఎక్క డుందో సైన్‌ బోర్డులను ఏర్పాటు చేసు కోవాలని సూచించారు. ప్రభుత్వం ద్వారా కొనసాగిస్తున్న అత్య వసర సర్వీసు లను కొనసాగించ వచ్చని చెప్పారు.ఈ సందర్భంగా సి విజిల్‌ నోడల్‌ అధికారి రామకృష్ణ ఈ యాప్‌ పై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అవగాహన కల్పిం చారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ కల్పశ్రీ, జిల్లా రెవెన్యూ అధికారి కె.వినాయకం పాల్గొన్నారు.

➡️