కోడ్‌ కూసిందనిసంతకాలతో ముగించారు

Mar 20,2024 21:34

 ప్రజాశక్తి-గరుగుబిల్లి : సార్వత్రిక ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉండటంతో స్థానిక మండల పరిషత్తు సర్వసభ్య సమావేశాన్ని బుధవారం సభ్యులు సంతకాలతో ముగించారు. బుధవారం ఎంపిడిఒ కార్యాలయం వద్ద వైస్‌ ఎంపిపి బత్తల లక్ష్మి అధ్యక్షతన మండల సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో సమస్యలపై సర్వసభ్య సమావేశంలో చర్చించలేమని ఎంపిడిఒ పైల సూర్యనారాయణ సభ్యులకు తెలియజేశారు. మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం 90 రోజుల్లోపు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో నిబంధనల మేరకు ఈ సమావేశం ఏర్పాటుచేశామన్నారు. కేవలం సభ్యుల సంతకాలు తీసుకుంటాం తప్ప ఎటువంటి సమస్యలపైనా చర్చించబోమని తెలిపారు. ఈసమావేశంలో జెడ్‌పి వైస్‌ చైర్మన్‌ మరిశర్ల బాపూజీనాయుడు, వైస్‌ ఎంపిపి నేరడుబిల్లి లక్ష్మి, ఎంపిటిసి సభ్యులు ద్వారపురెడ్డి సత్యనారాయణ (సత్తిబాబు) , దేవాతి నారాయణమ్మ, గుంట్రెడ్డి అన్న పూర్ణమ్మ, చింతల రూపవతి, సర్పంచులు బొంతాడ మహేశ్వర రావు, బోను చంద్రినాయుడు, కరణం రవీంద్ర, బేత వెంకటనాయుడు, తదితర సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

➡️