క్రీడలకు ప్రాధాన్యత : కోలగట్ల

Jan 6,2024 21:19

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  క్రీడాకారులకు తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. రూ.28లక్షలతో అభివృద్ధి చేసిన ఇండోర్‌ స్టేడియంను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అందిస్తున్న సహకారం వల్ల జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు పతకాలను సొంతం చేసుకుంటున్నారన్నారు. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర ద్వారా ప్రతి ఒక్కరూ క్రీడల పట్ల ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్‌ ఆర్‌ శ్రీ రాముల నాయుడు, వైసీపీ నగర అధ్యక్షుడు ఆశపు వేణు, జోనల్‌ ఇన్చార్జి డాక్టర్‌ విఎస్‌ ప్రసాద్‌, కుసుంబచ్చన్‌, ఎంకెబి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

➡️