క్రీడల్లో ‘ప్రకాశం’ విద్యార్థినుల జయభేరి

Dec 18,2023 19:51
విజయం సాధించిన విద్యార్థులు

విజయం సాధించిన విద్యార్థులు
క్రీడల్లో ‘ప్రకాశం’ విద్యార్థినుల జయభేరి
ప్రజాశక్తి-కందుకూరు పాలిటెక్నిక్‌ (డిప్లమో) విద్యార్థినులు సైతం జిల్లా స్థాయిలో జరిగిన క్రీడల పోటీల్లో సత్తా సాటి రాష్ట్ర, జిల్లా విజేతలుగా నిలిచారని ప్రకాశం ఇంజనీరింగ్‌ కళాశాల కరస్పాండెంట్‌ కంచర్ల రామయ్య సోమవారం వెల్లడించారు. ఒంగోలు సమీపంలోని ఈతముక్కల ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్‌ కాలేజీలో రెండు రోజులు పాటు జరిగిన జిల్లా స్థాయి ఆటల పోటీలలో అథ్లెటిక్స్‌లో కొన్ని విజయాలు సాధించారన్నారు. 400 మీటర్ల రిలే పరుగు పందెంలో ఎన్‌.కుమారి బందం ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారని తెలిపారు. లాంగ్‌ (బ్రాడ్‌) జంప్‌లో, 100 మీటర్ల పరుగు పందెంలో కూడా కుమారి ద్వితీయ స్థానం సాధించారన్నారు. ఫస్ట్‌ ఇయర్‌ డిప్లమో విద్యార్థిని పి.ఎల్‌.శతి 400 మీటర్ల రన్నింగ్‌ రేస్‌ మూడో స్థానంలో నిలిచారన్నారు. బాడ్మింటన్‌ డబుల్స్‌లో ఎం. మానస, కె. మంజు వాణి ద్వితీయ బహుమతిని అందుకున్నారని పర్యవేక్షకులు ఎస్‌.ఎం. మీరావలి,పిడి సుబ్రహ్మణ్యం తెలిపారు.

➡️