క్రీడల్లో రాష్ట్రం నెంబర్‌వన్‌గా ఉండాలి

ప్రజాశక్తి-కనిగిరి: ఆంధ్రప్రదేశ్‌ క్రీడల్లో నంబర్‌ వన్‌గా ఉండాలన్న దృఢ సంకల్పంతో ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ‘ఆడుదాం ఆంధ్ర’ ద్వారా క్రీడలను ప్రోత్సహించేందుకు యువతకు పెద్దపీట వేశారని కనిగిరి వైసీపీ ఇన్‌ఛార్జి దద్దాల నారాయణ యాదవ్‌ అన్నారు. కనిగిరి ఎంపీడీవో కార్యాలయంలో శనివారం కనిగిరి నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయిలో జరిగిన ‘ఆడుదాం ఆంధ్ర’ కోకో పోటీలో ప్రథమ బహుమతి సాధించిన బాలికల జట్టును ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట వేస్తూ యువతను ప్రోత్సహించేలా భావితరాలకు మంచి భవిష్యత్తు అందించేలా సీఎం కృషి చేస్తున్నారన్నారు. యువత క్రీడల్లో రాణించి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పేరు విశ్వవ్యాప్తం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వీడి కాశీ విశ్వనాథరెడ్డి, పిడిసిసి బ్యాంక్‌ చైర్మన్‌ వైఎం ప్రసాద్‌రెడ్డి, కనిగిరి జడ్పిటిసి మడతల కస్తూరిరెడ్డి, ఎంపీపీ దంతులూరి ప్రకాశం, వైస్‌ ఎంపీపీ లక్కిరెడ్డి తిరుపతిరెడ్డి, సర్పంచులు పోతు రమణారెడ్డి, దమ్ము వెంకటయ్య, కాసుల పెద్ద గురవయ్య, వైసీపీ నాయకులు మూలే గోపాల్‌రెడ్డి, వీరంరెడ్డి బ్రహ్మారెడ్డి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

➡️