క్వారీ సెంటర్లో అంబేడ్కర్‌ భవనం

Dec 30,2023 22:16
నగరంలోని క్వారీ

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం

నగరంలోని క్వారీ మార్కెట్‌ సెంటర్లో మరో అద్భుత కట్టడాన్ని త్వరలో నిర్మించబో తున్నట్టు ఎంపి మార్గాని భరత్‌ రామ్‌ తెలిపారు. శనివారం దళిత, గిరిజన, ప్రజా సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. అంబేద్కర్‌ భవనాన్ని ఎక్కడ నిర్మించాలనే విషయమై చర్చించారు. ఆఖరికి క్వారీ మార్కెట్‌ సెంటర్‌లో భవన నిర్మాణానికి అనువైనదిగా గుర్తించినట్లు తెలిపారు. డాక్టర్‌ బిఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహ ఏర్పాటుతోపాటు పార్లమెంటు భవన నమూనాలో అన్ని హంగులతో చక్కని భవనాన్ని నిర్మిస్తానని తెలిపారు. ఈ ఈ సమావేశంలో ఆయా ప్రజా సంఘాలకు చెందిన నాయకులు అజ్జరపు వాసు, బర్రే కొండబాబు, ఎం.బాబ్జీ, తాళ్ళూరి బాబూ రాజేంద్రప్రసాద్‌, దాసి వెంకట్రావు, ఎల్‌వి.ప్రసాద్‌, విజ్జన మధు, పట్నాల ఏసు, పాల్గొన్నారు.

➡️