క్షతగాత్రులకు సిపిఐ నాయకుల పరామర్శ

Feb 10,2024 21:30
ఫొటో : క్షతగాత్రులను పరామర్శిస్తున్న సిపిఐ నాయకులు

ఫొటో : క్షతగాత్రులను పరామర్శిస్తున్న సిపిఐ నాయకులు
క్షతగాత్రులకు సిపిఐ నాయకుల పరామర్శ
ప్రజాశక్తి-కావలి రూరల్‌ : జాతీయ రహదారి ముసునూరు టోల్‌ప్లాజా వద్ద రెండు లారీలు, ఒక ప్రయివేట్‌ ట్రావెల్‌ బస్సు ఢకొీని ఘోరరోడ్డు ప్రమాదంలో గాయపడి కావలి ఏరియా అసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సిపిఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య, కావలి నియోజక వర్గ కార్యదర్శి కొప్పర్తి నాగరాజు, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు దమ్ము దర్గాబుబు శనివారం పరామర్శించారు. కావలి ఏరియా హాస్పిటల్‌ బాధితులను కలసి జరిగిన ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించి కోలుకునేలా చర్యలు తీసుకోవాలని డాక్టర్లను కోరారు. ప్రమాదం జగిగిన వేంటనే పోలీసులు తక్షణం స్పందించి క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారని డాక్షర్లు వెంటనే వారికి వైద్య సేవలు అందించి కొంతమంది ప్రాణాలు నిలబెట్టారన్నారు. పోలీసులకు, డాక్టర్లకు దామా అంకయ్య అభినందనలు తెలిపారు. బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియో అందించాలని, క్షతగాత్రులకు పూర్తి మెడికల్‌ ఖర్చులు భరించాలన్నారు. ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడం బాదకరమని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

➡️