‘గడపగడపకు..’లో సమస్యల గుర్తింపు

Dec 17,2023 21:38

ప్రజాశక్తి-కొత్తవలస :  గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా గ్రామాల్లో సమస్యలను గుర్తించి, తదుపరి పరిష్కారంపై దృష్టిసారిస్తున్నట్లు ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు తెలిపారు. మండలంలోని రెల్లి గ్రామంలో ఆదివారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి గడపకూ వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఏమైనా సమస్యలుంటే తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అందిన సంక్షేమ పథకాలపై ఆరా, గ్రామాల్లో సమస్యల గుర్తింపు, తదుపరి సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడం, పరిష్కరించడం ఈ నాలుగు అంశాలు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలోని కీలక అంశాలని తెలిపారు. నేరుగా ప్రజలను కలిసి వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ ఇంకా మెరుగైన పరిపాలన అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామ సచివాలయ వ్యవస్థ, దానికి అనుసంధానంగా వాలంటీర్ల వ్యవస్థ ప్రభుత్వ పాలనను ప్రజల చెంతకు చేర్చాయన్నారు. ఏ గడప తొక్కినా ముఖ్యమంత్రి పట్ల కృతజ్ఞతాభావం వారి కళ్లల్లో స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. ఈ ప్రభుత్వం పదికాలాల పాటు సుపరిపాలనతో సాగడం ఖాయమన్నారు. కార్యక్రమంలో ఎంపిపి నీలంశెట్టి గోపమ్మ, వైసిపి మండల అధ్యక్షులు ఒబ్బిన నాయుడు, పిఎసిఎస్‌ అధ్యక్షులు గొరపల్లి శివ, సర్పంచ్‌ అల్లం సత్యనారాయణ, జోడి రాములమ్మ, ఎంపిటిసి ఉగ్గిన గురూజీ, సీనియర్‌ నాయకులు మేలాస్త్రి అప్పారావు, గొరపల్లి రవికుమార్‌, పళ్ళ భీష్మ, సాల్మన్‌ పాల్గొన్నారు.

నెల్లిమర్ల : వైసిపి ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదిం చాలని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు కోరారు. పట్టణంలో 5, 6 వార్డుల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాల అమలు తీరు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎక్కడా లేని విధంగా ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ బంగారు సరోజినీ, వైస్‌ చైర్మన్‌ సముద్రపు రామారావు, వైసిపి నగర పంచాయతీ అధ్యక్షులు చిక్కాల సాంబశివరావు, జెడ్‌పిటిసి గదల సన్యాసినాయుడు, కార్పొరేషన్ల డైరెక్టర్లు మద్దిల వాసు, ఆర్‌.శ్రీనివాసరావు, నౌపాడ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

➡️