గడ్డి తిని బతకాలా..?

Dec 29,2023 20:39

 ప్రజాశక్తి-బొబ్బిలి :   రోజంతా కష్టపడినా ప్రభుత్వం ఇస్తున్న అరకొర జీతంతో గడ్డి తిని బతకాలా? అంటూ అంగన్‌వాడీలు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని ప్రశ్నించారు. తమ సమస్యలు పరిష్కరించాలని, పనికి తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె శుక్రవారం 18వ రోజుకు చేరుకుంది. బొబ్బిలి పట్టణంలో సమ్మె శిబిరంలో అంగన్వాడీలు వినూత్నరీతిలో గడ్డి తింటూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకరరావు, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు కామేశ్వరి, ఉమాగౌరి, అనురాధ, నిర్మల, పద్మ పాల్గొన్నారు.విజయనగరం టౌన్‌ : సమ్మెలో భాగంగా కలెక్టరేట్‌ ఎదుట సమ్మె శిబిరంలో పచ్చ గడ్డి తింటూ అంగన్వాడీలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు బి.పైడిరాజు, నాయకులు సుశీల, రాధ, ఉష మాట్లాడారు. సమస్యలు పరిష్కారం చేయకుంటే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. గంట్యాడ : సమ్మెలో భాగంగా గంట్యాడలో నోట్లో గడ్డి పెట్టుకుని అంగన్వాడీలు నిరసన తెలిపారు. డిమాండ్లను పరిష్కరించే వరకూ పోరాటం సాగిస్తామని నినాదాలు చేశారు.రామభద్రపురం : ఆర్‌టిసి కాంప్లెక్సు ఎదురుగా అంగన్వాడీలు చేపడుతున్న దీక్షా శిబిరాన్ని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బేబినాయన సందర్శించి, మద్దతు తెలిపారు. కార్యక్రమంలో టిడిపి కార్యవర్గ సభ్యులు చింతల రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు మడక తిరుపతిరావు, సర్పంచ్‌ రవ్వ ఈశ్వరరావు, సిఐటియు మండల కార్యదర్శి బలసా శ్రీనివాసరావు పాల్గొన్నారు.గజపతినగరం : గజపతినగరంలో అంగన్వాడీలు పచ్చి గడ్డి తింటూ నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ ప్రాజెక్టు అధ్యక్ష, కార్యదర్శులు ఎం.సుభాషిని, పి.జ్యోతి, సెక్టార్‌ లీడర్లు డి.నాగమణి, వాణి, నారాయణమ్మ, సన్యాసమ్మ, సుజాత పాల్గొన్నారు.శృంగవరపుకోట : పట్టణంలోని ఐసిడిఎస్‌ కార్యాలయానికి ఎదురుగా చేపట్టిన సమ్మె శిబిరంలో అంగన్వాడీలు ఉరివేసుకుని నిరసన తెలిపారు. అంగన్వాడీలకు పంచాయతీ పారిశుధ్య కార్మికులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి మద్దిల రమణ, నాయకులు చెలికాని ముత్యాలు, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు జె.లలిత, డి.శ్యామల పాల్గొన్నారు.జామి : జామిలో సమ్మె శిబిరంలో అంగన్వాడీలు పచ్చ గడ్డి తింటూ నిరసన తెలిపారు. అంగన్వాడీలకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గాడి అప్పారావు సంఘీభావం తెలిపారు. అంగన్వాడీల సమ్మె శిబిరాన్ని గజపతినగరం మాజీ ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు సందర్శించి, మద్దతు తెలిపారు. ఆయన వెంట టిడిపి మండల నాయకులు స్వామినాయుడు, సూర్యారావు, తదితరులు పాల్గొన్నారు.కొత్తవలస : ఎంపిడిఒ కార్యాలయం వద్ద అంగన్వాడీలు రిలే దీక్షలు 18వ రోజు కొనసాగించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు గాడి అప్పారావు, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు కాకర తులసి, శంకరావతి, తదితరులు పాల్గొన్నారు.

➡️