గాజువాకలో శంకర్‌ ఫౌండేషన్‌ కంటి పరీక్షల కేంద్రం

శంకర్‌ ఫౌండేషన్‌ కంటి ఆసుపత్రి

ప్రజాశక్తి -గాజువాక : గాజువాకలో శంకర్‌ ఫౌండేషన్‌ కంటి ఆసుపత్రి వైద్యపరీక్షల కేంద్రాన్ని బ్రాండిక్స్‌ ఇండియా భాగస్వామి దొరైస్వామి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుపేదల కంటిసంరక్షణ అవసరాలను తీర్చడంలో శంకర్‌ ఫౌండేషన్‌తో బ్రాండిక్స్‌ సుదీర్ఘ అనుబంధాన్ని కలిగి ఉందని గుర్తు చేశారు. కంటి సంరక్షణలో జాతీయ ప్రమాణాలతో సేవలు అందించడం ద్వారా శంకర్‌ ఫౌండేషన్‌ సమాజానికి మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో శంకర్‌ ఫౌండేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రస్టీలు ఆత్మకూరి కృష్ణకుమార్‌, ఆత్మకూరి విజయకుమార్‌, కె రాధాకృష్ణన్‌, జిఎం (అడ్మిన్‌, ఆపరేషన్స్‌) డాక్టర్‌ నస్రిన్‌, డాక్టర్‌ శిరీష, డాక్టర్‌ మమత, డాక్టర్‌ సుబ్బారావు, శంకర్‌ ఫౌండేషన్‌ సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

ప్రారంభిస్తున్న బ్రాండిక్స్‌ భాగస్వామి దొరైస్వామి.

➡️