గిరిజన గ్రామాల్లో సమస్యలపై చర్యలు

గిరిజన గ్రామాల్లో సమస్యలపై చర్యలు

ప్రజాశక్తి-కాకినాడజిల్లాలోని గిరిజన ప్రాంతాలోల మూడు రోజులపాటు పర్యటించినట్టు ఎస్‌టి కమిషన్‌ సభ్యుడు వడిత్యా శంకర్‌ నాయక్‌ తెలిపారు. గురువారం జెఎన్‌టియుకె అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పర్యటన వివరాలను వెల్లడించారు. ప్రత్తిపాడు మండలం గిరిజనాపురంలో ప్రజలుకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందడం లేదని, ఆ గ్రామంలో 40 మంది ప్రజలు ఉన్నారని ఆయన తెలిపారు. ఆ గ్రామంలో 9.1/2 ఎకరాల గిరిజన భూమిని ఎవరో రాయించుకుని వారిని అక్కడ నుండి పొమ్మని బెదిరిస్తున్నారని తెలిపారు. అక్కడ సమస్యలను తక్షణం పరిష్కరించాలని అధికారులను ఆదేశించామన్నారు. వంతాడ, పాండవులపాలెం గ్రామాలలో పర్యటించామన్నారు. వంతాడలో మైనింగ్‌ జరుగుతోందని, ఆ గ్రామంలో సంక్షేమ, అభివద్ధి కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఎ.విజయశాంతి, గిరిజన నాయకులు భానుచందర్‌, డాక్టర్‌ మధు, నరసింహులు, మల్లేష్‌, హనుమాన్‌ నాయక్‌ పాల్గొన్నారు.

➡️