గెలుపే లక్ష్యంగా పనిచేయాలి :ఎంపీ

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి :ఎంపీప్రజాశక్తి-కలికిరి గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక మండల కేంద్రంలోని హేమాచారి కల్యాణ మండపంలో కలికిరి మండల స్థాయి సమీక్ష సమావేశాన్ని, ఎంపీ మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎపిఎండిసి డైరెక్టర్‌ హరీష్‌ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ కమిషన్‌ చైర్మన్‌ ఇక్బాల్‌ అహ్మద్‌, ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని 14 గ్రామ పంచాయతీ పరిధిలోని కార్యకర్తలను నాయకులను పిలిపించి గ్రామాలకు చెందిన కార్యకర్తలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబానికి వివరించి గెలుపే లక్ష్యంగా పెట్టుకుని ప్రతి కార్యకర్త బాధ్యతగా పనిచేయాలని కోరారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు జామియా మసీదులో నమాజ్‌కు వెల్లి ముస్లిం మైనార్టీ నాయకులతో ప్రార్థనలు నిర్వహించారు. సాయంత్రం ఏడు గంటలకు ముస్లిం సోదరులతో ఇఫ్తార్‌ విందులో పాల్గొ న్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఆగాముద్దీన్‌, పీలేరు నియో జకవర్గ పరిశీలకులు సహదేవరెడ్డి, మండల కన్వీనర్‌ చింతల రమేష్‌ రెడ్డి, ఎంపిపి వేంపల్లి నూర్జహాన్‌, జడ్‌పిటిసి పద్మజా లోకవర్ధన్‌, సీనియర్‌ నాయ కుడు నల్లారి తిమ్మారెడ్డి, జిల్లా ఎస్‌సిసెల్‌ కార్యదర్శి వి.హరి, సీనియర్‌ నాయకులు రాహుల్‌ చక్రవర్తిరెడ్డి, సర్పంచ్‌లు వెంకటరెడ్డి, సురేందర్‌ రెడ్డి, గంగయ్య, తస్లీమా రియాజ్‌, ఎంపిటిసి బోగేష్‌, వైస్‌ ఎంపిపి శ్రీకాంత్‌ యాదవ్‌, కో-ఆప్షన్‌ మెంబర్‌ రిజ్వాన్‌, అజరు, ఖాదర్‌, జెఎసి వ్యవస్థాపకుడు హనీఫ్‌, వెంకటపతి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️