గొప్ప పరిపాలనాధక్షుడు శ్రీకృష్ణదేవరాయులు

ప్రజాశక్తి- మదనపల్లి శ్రీకష్ణ దేవరాయులు గొప్ప పరిపాలన దక్షుడని మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మదనపల్లె రూరల్‌ మండలం బసినకొండ పంచాయతీ, పుంగనూరు రోడ్డులో బలిజ జెఎసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీకష్ణ దేవరాయలు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి అతిథులుగా కౌవారం పీఠం ధర్మకర్త ఎం.ఎస్‌. జయరామయ్య, ఎమ్మెల్యేలు ఎం.నవాజ్‌ బాషా, పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌ రెడ్డి, జంగాలపల్లె శ్రీనివాసులు, కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ అడపా శేషు, మాజీ టిటిడి పాలక మండలి సభ్యులు పోకల అశోక్‌కుమార్‌, డీకే తేజస్విని హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసని సభలో మంత్రి మాట్లాడుతూ కృష్ణదేవరాయుల పాలనా కాలం దక్షిణ భారతదేశం ఓ వెలుగు వెలిగిందన్నారు. ప్రజల శ్రేయస్సు కోసం ఆయన అనేక సంస్కరణలు చేపట్టారన్నారు. మదనపల్లె బలిజ ఆకాంక్షల మేరకు రెండు చోట్ల శ్రీకష్ణదేవరాయల విగ్రహాలను ఏర్పాటు చేశామన్నారు. మదనపల్లె డివిజన్‌ పరిధిలో ఎక్కడైనా శ్రీకష్ణదేవరాయల విగ్రహాలు ఏర్పాటు చేయాలనుకుంటే తమవంతు సహకారం అందిస్తామన్నారు. అనంతరం కైవారం పీఠం ధర్మకర్త ఎం.ఎస్‌.జయరామయ్య శ్రీకష్ణదేవరాయల పాలనను స్వర్ణయుగం అని అభివర్ణించారు. దక్షిణ భారతదేశంలో ఎన్నో ఆలయాలు నిర్మించి వాటి అభివద్ధికి కషి చేశారని కొనియాడారు. ఎమ్మెల్యే నవాజ్‌ బాషా మాట్లాడుతూ శ్రీకష్ణదేవరాయులు గొప్ప పాలకుడే కాకుండా స్వయానా కవి అన్నారు. జంగాలపల్లె శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీకష్ణ దేవరాయలు ఎన్నో గ్రంథాలు రచించారని, అం దులో ఆముక్త మాల్యద గ్రంథం ఎంతో ప్రసిద్ధిగాంచిందన్నారు. దేశ భాషల యందు తెలుగు లెస్స అని కీర్తించారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా విగ్రహ ఏర్పాటుకు సహకరించిన దాతలను బలిజ జెఎసి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మదనపల్లె బలిజకులస్తులు, ప్రజలు పాల్గొన్నారు.

➡️