గోకవరంలో టిడిపి కార్యాలయాన్ని ప్రారంభించిన జ్యోతుల నెహ్రూ

Dec 25,2023 15:52 #East Godavari, #TDP

ప్రజాశక్తి-గోకవరం(తూర్పుగోదావరి) : మండల కేంద్రమైన గోకవరం రెవెన్యూ కార్యాలయం ఎదురుగా పైలా శ్రీను ఇంటి వద్ద టిడిపి నూతన కార్యాలయాన్ని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ.. నియోజవర్గంలో మొదటిగా గోకవరం నుంచి ఎన్నికల శంఖారావం ఈ పార్టీ కార్యాలయం ప్రారంభించడం ద్వారా మొదలయిందన్నారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి, జనసేన ప్రభుత్వం రాబోతుందని నెహ్రూ తెలిపారు. అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో జగ్గంపేట నియోజకవర్గంలో వైసీపీ నుండి అతి త్వరలో భారీగా చేరికలు ఉంటాయని, అందుకుగాను ఆరు బస్సులను సిద్ధం చేయడం జరిగిందని నెహ్రూ తెలిపారు. గ్రామాల్లో, పట్టణాలలో ప్రజలలో మార్పు ఎప్పుడో మొదలైందని ఇది జగన్మోహన్‌ రెడ్డి రాక్షస పాలనకు నిదర్శనమని నెహ్రూ తెలిపారు. తెలుగుదేశం పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు సమాన న్యాయం జరుగుతుందని, ఆ విధంగా చూసే బాధ్యత నాదని నెహ్రూ కార్యకర్తలకు హామీ ఇచ్చారు. అదేవిధంగా పార్టీ కోసం కార్యాలయంను సిద్ధం చేసిన పైలా శ్రీనివాస్‌ ను నెహ్రూ అభినందించారు.ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

➡️