గ్యాస్‌, పెట్రోల్‌ అమ్మకాలు పెంచండి : జిసిసి డిఎం

Mar 15,2024 21:01

 ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : స్థానిక గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న గ్యాస్‌ గోదాము, పెట్రోల్‌ బంక్‌ల్లో సిబ్బంది సమయపాలన పాటించి అమ్మకాలు పెంచాలని, ప్రజలతో సత్సంబంధాలు పెంచుకోవాలని జిసిసి పార్వతీపురం డివిజనల్‌ మేనేజర్‌ మహేంద్ర కుమార్‌ సూచించారు. తన పర్యటనలో భాగంగా శుక్రవారం గ్యాస్‌ గోదాం, పెట్రోల్‌ బంక్‌ పరిశీలించారు. స్టాక్‌ నిల్వ రిజిస్టర్లు పరిశీలించారు. అనంతరం బ్రాంచి మేనేజర్‌ కృష్ణప్రసాద్‌, అకౌంటెంట్‌ గణపతికి తగు సూచనలు చేశారు. ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన 10 కేజీల సిలిండర్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. ఈ ఏడాది డివిజన్‌లో అటవీ వ్యవసాయ ఉత్పత్తుల లక్ష్యం రూ.9.20 కోట్లు కాగా ఇప్పటివరకు రూ.11.83 కోట్లు సాధించామని తెలిపారు. అన్ని రకాల విభాగాలు కలిపి నిత్యవసరాలు, డిఆర్‌ఎస్‌ అమ్మకాలు, గ్యాస్‌, పెట్రోల్‌ రూ.56 కోట్ల లక్ష్యం పూర్తి చేశామని తెలిపారు. ఈనెలాఖరుకు రూ.10 కోట్ల అమ్మకాలు పూర్తి చేస్తామని చెప్పారు.

➡️