గ్రామీణ బంద్‌ ప్రశాంతం

గ్రామీణ బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. కడప, అన్నమయ్య జిల్లాల్లోని వామపక్ష రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలతో కలిసి సిఐటియు, ఎఐటియుసి, కాంగ్రెస్‌ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కూలీలు సంయుక్తంగా పెద్దఎత్తున ఉద్యమించారు. కేంద్రంలోని బిజెపి సర్కారు తెచ్చిన మూడు నిరంకుశ వ్యవసాయ నల్లచట్టాలను రద్దు చేయాలని కోరుతూ దేశ రాజధాని ఢిల్లీలో రైతులు పెద్దఎత్తున చేపట్టిన ఉద్యమానికి సంఘీభావంగా చేపట్టిన గ్రామీణ బంద్‌ జయప్రదమైంది. ఉమ్మడి జిల్లాలోని కడప, కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, బద్వేల్‌, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు, పీలేరు, మదనపల్లి, తంబళ్లపల్లి అసెంబ్లీ కేంద్రాల్లోని సుమారు 66 మండలాల గ్రామీణ ప్రాంతాల్లో నిరసనలు, భారీ ర్యాలీలు నిర్వహించారు. పోస్టాఫీసులు, బిఎస్‌ఎన్‌ఎల్‌, అంగన్వాడీ కేంద్రాల్లో వినతిపత్రాలను అందజేశారు.ప్రజాశక్తి – కడప ప్రతినిధి/యంత్రాంగంగ్రామీణ బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. కడప, అన్నమయ్య జిల్లాల్లోని వామపక్ష రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలతో కలిసి సిఐటియు, ఎఐటియుసి, కాంగ్రెస్‌ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కూలీలు సంయుక్తంగా పెద్దఎత్తున ఉద్యమించారు. కేంద్రంలోని బిజెపి సర్కారు తెచ్చిన మూడు నిరంకుశ వ్యవసాయ నల్లచట్టాలను రద్దు చేయాలని కోరుతూ దేశ రాజధాని ఢిల్లీలో రైతులు పెద్దఎత్తున చేపట్టిన ఉద్యమానికి సంఘీభావంగా చేపట్టిన గ్రామీణ బంద్‌ జయప్రదమైంది. ఉమ్మడి జిల్లాలోని కడప, కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, బద్వేల్‌, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు, పీలేరు, మదనపల్లి, తంబళ్లపల్లి అసెంబ్లీ కేంద్రాల్లోని సుమారు 66 మండలాల గ్రామీణ ప్రాంతాల్లో నిరసనలు, భారీ ర్యాలీలు నిర్వహించారు. పోస్టాఫీసులు, బిఎస్‌ఎన్‌ఎల్‌, అంగన్వాడీ కేంద్రాల్లో వినతిపత్రాలను అందజేశారు. రాయచోటి టౌన్‌ : సంయుక్త కిసాన్‌ మోర్చాలోని రైతు కార్మిక సంఘాలు, ఉమ్మడిగా ఇచ్చిన దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా రాయచోటిలో వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన తెలియజేస్తూ తర్వాత ర్యాలీ చేపట్టి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మానవహారం నిర్మించడంతో గంట పాటు ట్రాఫిక్‌ స్తంభించింది. అనంతరం పోస్టాఫీసు, ఎల్‌ఐసి, ఎస్‌బిఐలను సిఐటియు, రైతు సంఘాల నేతలు మూయించి వేయడంతో పలు సేవలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎస్‌.రామచంద్ర, రంగారెడ్డి, గిరిజన సంఘం నాయకులు విశ్వనాథ్‌ నాయక్‌ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కృష్ణప్ప, సిఐటియు ఉపాధ్యక్షులు ఎవి.రమణ మాట్లాడుతూ కార్మికులకు ఆసరాగా ఉండే 44 కార్మిక చట్టాలను రద్దు చేసి, యజమానులకు కార్పొరేట్‌ లాభాలకు అనుకూలంగా నాలుగు లేబర్‌ కోడ్లు తీసుకువచ్చి కార్మికులను నయా బానిసలుగా మార్చాడని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం రైతాంగ పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేయాలన్నారు. కౌలు రైతులకు పంట రుణాలు, పంట నష్టపరిహారం భూ యజమానితో సంబంధం లేకుండా ఇవ్వాలని తెలిపారు. ఏ పని చేసే కార్మికుడికైనా కనీస వేతనం రూ.26 వేలు చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ రాయచోటి ప్రాజెక్టు అధ్యక్షులు సిద్ధమ్మ, నాగమణి, సబీనా, సరస్వతి, భూదేవి, మున్సిపల్‌ నాయకులు రాంబాబు, చెన్నయ్య, హమాలీ నాయకుతు జి.మాధవయ్య పంచాయతీ కార్మికుల స్వచ్ఛ భారత కార్మికుల అధ్యక్షులు ఎం.శేఖర్‌ నాయక్‌, ఎఐటియుసి నాయకులు శ్రీనివాసులు, హుస్సేన్‌ పాల్గొన్నారు. మదనపల్లి : నిరంకుశత్వంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు అన్నారు. పట్టణంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, సంయుక్త కిసాన్‌ మోర్చా, కార్మిక సంఘాలు తలపెట్టిన రైతాంగ, పారిశ్రామిక కార్మిక బంద్‌ సందర్భంగా నిరసనలు వెల్లువెత్తాయి. పట్టణంలోని బ్యాంకులు, బిఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం, హెడ్‌ పోస్ట్‌ ఆఫీసు మూత వేయించి బంద్‌ చేపించారు. పట్టణంలో స్కూటర్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బిఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తహశీల్దార్‌ కార్యాలయం ముందు బెంగళూరు రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. ఐసిడిఎస్‌ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరిన అంగన్వాడీలు చిత్తూరు బస్టాండ్‌ సర్కిల్‌లో మానవహారం ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని, లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి పర్మినెంటు చెయ్యాలని, ఉపాధి హామీ పని దినాలు పెంచాలని, కూలీ 600 రూపాయలు ఇవ్వాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పి.శ్రీనివాసులు మాట్లాడుతూ ఆందోళన చేస్తున్న, రైతులు, కార్మికులపై దేశ సరిహద్దులో రణరంగం మాదిరిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం రబ్బర్‌ బుల్లెట్‌ గుల్ల వర్షం కురిపిస్తూ, బాష్ప వాయువు ప్రయోగిస్తూ, రైతులను, కార్మికులను నిర్బంధిస్తుందని పేర్కొన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించకుండా, కార్మికులకు కనీస వేతన చట్ట ప్రకారం వేతనాలు ఇవ్వకుండా , కార్మికుల హక్కులకు భంగం కలిగిస్తూ ప్రభుత్వం అచ్చేదీన్‌ అని భీరాలు పలుకుతుందని పేర్కొన్నారు. దుర్మార్గపు బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కార్మికులు, కర్షకులు ఐక్యంగా కలిసి రావాలని కోరారు. కార్యక్రమంలో ఎపి రైతు సంఘం మండల నాయకులు పవన్‌, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సుధాకర్‌, సిఐటియు నాయకులు ప్రభాకర్‌రెడ్డి, నారాయణ, ఖదీర్‌ అహ్మద్‌, రాజశేఖర్‌, అంగన్వాడీ యూనియన్‌ జిల్లా కార్యదర్శి పి.రాజేశ్వరి, నాయకులు మధురవాణి, గంగాదేవి, విజయ, పంచాయతీ వర్కర్ల సంఘం నాయకులు గోపాల్‌, ఐటియుసి నాయకులు కృష్ణమూర్తి పాల్గొన్నారు. పెనగలూరు : ఎంపిడిఒ, తహశీల్దార్‌ కార్యాలయాల వద్ద సిఐటియు మండల కార్యదర్శి మద్దెల ప్రసాద్‌ ఆధ్వర్యంలో అంగన్వాడీలు, విఆర్‌ఎలు నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో నాయకులు చింతలపల్లి నందకుమార్‌, కోటి నరసయ్య రామకృష్ణయ్య, ఉమా, చంద్రకళ, శిరీష, సుజాత, గంగాద్రి, రాధ, భాను పాల్గొన్నారు. సంబేపల్లె (రాయచోటి) :ఎపి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిరిపురి రామచంద్ర ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు జి.భాస్కర్‌రెడ్డి, సిఐటియు నాయకులు అనసూయమ్మ, శ్రీలత, ఫర్హానా, చాందినీ, వెంకట సుబ్బమ్మ, జయలక్ష్మి పాల్గొన్నారు. పుల్లంపేట: ఓబులవారిపల్లి ప్రభుత్వ ఆస్పత్రి నుంచి ఎస్‌బిఐ వరకు ర్యాలీగా వెళ్లి తమశీల్దార్‌ కార్యాలయం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జయరామయ్య, నాయకులు హరిప్రసాద్‌, బి.కేశవులు, వెంకట్‌రెడ్డి, దుర్గ, సుభద్ర, లక్ష్మీదేవి, చెన్నకేశవులు, కాంగ్రెస్‌ నాయకులు బొమ్మి సంగయ్య, మహిళ సమైక్య మండల కార్యదర్శి మడగలం రోజమ్మ, చింతలపూడి నాగమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి హజీమ పాల్గొన్నారు. రైల్వేకోడూరు: స్థానిక గాంధీ విగ్రహం వద్ద, సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌ చంద్రశేఖర్‌, సిఐటియు మండల అధ్యక్షులు పుల్లయ్య, ఉపాధ్యక్షులు లింగాల యానాదయ్య, కోశాధికారి, హరి నారాయణ, విద్యుత్‌ కార్మిక నాయకులు కిరణ్‌ కుమార్‌, అంకయ్య, సుబ్బరాయుడు, జోగినేనీ మనీ, అంగన్వాడీ యూనియన్‌ ప్రాజెక్టు కోశాధికారి పద్మ, మండల నాయకులు వెన్నెల, జైకుమారి, పిడుగు శోభ, మణెమ్మ, రత్న, జ్యోతి, విఆర్‌ఎ సంఘం నాయకులు, లక్ష్మీకర్‌, కుమార్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్ల సంఘ నాయకులు, తుపాకుల హరిప్రసాద్‌,ఆటో యూనియన్‌ నాయకులు, సుబ్బరాయుడు, సుబ్బరామయ్య, కెవిపిఎస్‌ జిల్లా కన్వీనర్‌, ఓబిలి పెంచలయ్య,వ్యవసాయ కార్మిక సంఘం, మండల నాయకులు, బొజ్జ శివయ్య పాల్గొన్నారు. మంగంపేట ఎపిఎండిసిలో…: జెఎసి పోరాట కమిటీ కన్వీనర్‌ ఆర్‌.వెంకటేష్‌, నాయకత్వంలో ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌, సిఐటియు అనుబంధం, ఎపిఎంసి వర్కర్స్‌ యూనియన్‌, మంగంపేట మైనింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌, త్రివేణి, ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించారు. డిస్పాచ్‌, తోలకాలు, స్వచ్ఛందంగా నిలిపివేసి, ట్రాన్స్‌పోర్టు రంగం, లారీ, డ్రైవర్లు దాదాపు 300 మంది సంఘీభావంగా పాల్గొన్నారు. రాజంపేట అర్బన్‌ : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సిపిఎం, సిపిఐ నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక ఆర్‌అండ్‌ బి బంగ్లా నుంచి పాత బస్టాండ్‌ మీదుగా బైపాస్‌ రోడ్డులోని ఎన్టీఆర్‌ కూడలి వరక ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో నాయకులు చిట్వేలి రవికుమార్‌, గాలి చంద్ర, రాయుడు, మహేష్‌, శివరామకృష్ణ, సికిందర్‌, నాగేశ్వరరావు, మున్నా, రమణ, చంద్ర, రవి, విజయ, శివరంజని, శంకరయ్య, నరసింహ పాల్గొన్నారు.

➡️