గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు సిఐటియు సంపూర్ణ మద్దతు

Feb 23,2024 16:10 #CITU

ప్రజాశక్తి -కర్నూలు :గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల కొరకు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కర్నూలు నగరంలో సమ్మె నిర్వహించారు. ఈ సమ్మె సందర్భంగా జరిగిన సభకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం .డి. అంజిబాబు హాజరై తమ సంపూర్ణ మద్దతును తెలియజేశారు.బ్యాంకు ఉద్యోగుల సంఘం అధ్యక్షులు హనుమంత రెడ్డి అధ్యక్షతన స్థానిక భాగ్యనగరం నందుగల బ్యాంకు రీజినల్‌ కార్యాలయం దగ్గర జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం చేస్తున్న ఉద్యమం సిఐటియు బలపరుస్తుంది అని తెలియజేశారు. డైలీవేజ్‌ కింద పని చేసే వారిని రెగ్యులర్‌ చేయాలన్నారు. కంప్యూటర్‌ ఇంక్రిమెంట్‌ , పూర్తి పెన్షన్‌ , గ్రాడ్యుటీ సర్వీసు రూల్‌ ప్రకారం చెల్లించాలని తదితర డిమాండ్లను నెరవేర్చాలన్నారు.ఉద్యమాల ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కారం చేసుకోగలమని భవిష్యత్తు కాలంలో కూడా ఉద్యమాలకు ఉద్యోగులు కార్మికులు సిద్ధం కావాల్సిన అవసరం ఉందని ఆయన కోరారు.

➡️