గ్రూప్‌-1 పరీక్ష ప్రశాంతం

Mar 18,2024 00:16

టిజెపిఎస్‌ కేంద్రంలో ప్రశ్నాపత్రాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌
ప్రజాశక్తి-గుంటూరు :
జిల్లాలో ఆదివారం నిర్వహించిన గ్రూప్‌-1 స్క్రీనింగ్‌ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 23 పరీక్షా కేంద్రాలలో పరీక్షలు జరిగాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌-1 పరీక్ష, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్‌ 2 పరీక్ష నిర్వహించారు. ఉదయం 8,785 మంది హాజరవగా, 6,254 మంది గైర్హజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 8,714 మంది హాజరవగా 6,325 మంది గైర్హజరయ్యారు. స్థానిక టీజెపీఎస్‌ కళాశాలలోని పరీక్షా కేంద్రంలో జరిగిన స్క్రీనింగ్‌ పరీక్షలను జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి పరిశీలించారు.

➡️