ఘనంగా ఎస్‌ఎఫ్‌ఐ ఆవిర్భావ ఉత్సవం

Dec 30,2023 22:17 #ఎస్‌ఎఫ్‌ఐ
ఘనంగా ఎస్‌ఎఫ్‌ఐ ఆవిర్భావ ఉత్సవం

ప్రజాశక్తి-కాకినాడఎస్‌ఎఫ్‌ఐ 54వ ఆవిర్భావ దినోత్సవం శనివారం కాకినాడ కచేరి పేటలోని ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయం ఘనంగా నిర్వహించారు. స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం జెండాను ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కె.ప్రసన్నకుమార్‌ ఆవిష్కరించారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ.అశోక్‌ మాట్లాడుతూ విద్యారంగ పరిరక్షణకు, విద్యార్థుల సమస్యలపై ఎస్‌ఎఫ్‌ఐ నిరంతరం రాజీ లేని పోరాటం చేస్తోందన్నారు. గత 54 ఏళ్లలో 279 మంది ప్రాణత్యాగం చేశారన్నారు. ప్రభుత్వ విద్యారంగం పరిరక్షణకు దేశంలో నికరంగా పోరాడే సంఘం ఎస్‌ఎఫ్‌ఐ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై పోరాటం ఉధతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి.వరహాలు, ఎం.గంగాసూరిబాబు, రాష్ట్ర నాయకులు రవి, అక్బర్‌, అశోక్‌, గోపాల్‌, ఆదర్శ్‌, శివరాజ్‌ పాల్గొన్నారు.

➡️