ఘనంగా పెన్షనర్ల దినోత్సవం

Dec 17,2023 21:39

ప్రజాశక్తి-బొబ్బిలి  :  జాతీయ పెన్షనర్ల దినోత్సవాన్ని ఆది వారం శ్రీకళా భారతి ఆడిటోరి యంలో ఘనంగా నిర్వహించారు. 75 ఏళ్లు దాటిన పెన్షనర్లను ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పెన్షనర్లు జాతి సంపదని, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రౌతు రామమూర్తి మాట్లాడుతూ పెన్షనర్లకు ప్రతినెలా ఒకటో తేదికి పెన్షన్‌ ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఒకటో తేదికి పెన్షన్‌ ఇచ్చేలా చూడాలని ఎమ్మెల్యే శంబంగిని కోరారు. కార్యక్రమంలో పెన్షనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కర్రి సత్యనారాయణ, జిల్లా నాయకులు ఎల్‌.జగన్నాథం, కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

➡️