ఘనంగా ‘పోషణ పక్వాడా’

ప్రజాశక్తి-వేటపాలెం: పోషణ పక్వాడా కార్యక్రమం మంగళవారం వేటపాలెం ఐసిడిఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని దేశాయిపేట సెక్టార్‌లో గల ఆమోదగిరి పట్నం బుర్రయ కాలనీ అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్‌ ఏ బ్యూలా మాట్లాడుతూ పోషక ఆహారం తీసుకుని మహిళలు ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని అన్నారు. అందులో భాగంగా తల్లులకు ముగ్గుల పోటీలను నిర్వహించి, తదుపరి రాగి, జొన్న, సజ్జ పిండిలతో దోశలు, బూరెలు, రొట్టెలు మొదలగునవి తయారుచేసే విధానాన్ని తల్లులకు చూపించారు. సూపర్‌వైజర్‌ ఎస్‌ లీలావతి, అంగన్వాడీ కార్యకర్తలు ఎన్‌ పూర్ణిమ, ఎమ్‌ పద్మ, బి వరలక్ష్మి, టి లక్ష్మి సుజాత, డి శారద, జి నాగలక్ష్మి పాల్గొన్నారు.

➡️