ఘనంగా లోకేష్‌ పుట్టినరోజు వేడుకలు

ప్రజాశక్తి-బాపట్ల: తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పుట్టినరోజు వేడుకలను టిడిపి బాపట్ల నియోజకవర్గ బాధ్యులు వేగేశన నరేంద్రవర్మ ఆధ్వర్యంలో మంగళవారం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్‌ కట్‌ చేసి పంచి పెట్టారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.క్రిస్టియన్‌ భవన్‌లో.. విశ్రాంత ఐఆర్‌ఎస్‌ అధికారి దగ్గుమళ్ల ప్రసాదరావు ఆధ్వర్యంలో బాపట్ల క్రిస్టియన్‌ భవన్‌లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పేద, వృద్ధ మహిళలకు ప్రసాదరావు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాధే గ్రూప్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. చీరాల: పార్టీ కార్యక్రమాలలోనూ సామాజిక సేవలలోనూ విశేషంగా కృషి చేస్తున్న టిడిపి నాయకులు సజ్జా వెంకటేశ్వర్లు అభినందనీయులని మాజీ మంత్రి జాగర్లమూడి లక్ష్మీ పద్మావతి అన్నారు. మంగళవారం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ జన్మదిన వేడుకలను సజ్జా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని మహిళా మండలి వృద్ధాశ్రమంలో మాజీమంత్రి లక్ష్మీ పద్మావతితో కేక్‌ కటింగ్‌ నిర్వహించారు. ఆమె చేతుల మీదగా వృద్ధులకు చీరల పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి మంచి రోజులు ప్రాప్తిస్తాయని అన్నారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు అందరూ సమిష్టిగా కృషి చేసి చంద్రబాబును ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని అన్నారు.

➡️