ఘనంగా సందీప్‌ జన్మదిన వేడుకలు

Dec 17,2023 21:40

 ప్రజాశక్తి-మెరక ముడిదాం  :  ధీర ఫౌండేషన్‌ అధినేత డాక్టర్‌ బొత్స సందీప్‌ జన్మదిన వేడుకలు ఆదివారం మండలంలో ఘనంగా నిర్వహించారు. ఎంపిపి తాడ్డి కృష్ణవేణి, మాజీ ఎంపిపి తాడ్డి వేణుగోపాలరావు ఆధ్వర్యంలో గర్భాం మేజర్‌ పంచాయతీలోను, డిసిఎంఎస్‌ మాజీ చైర్మన్‌ ఎస్‌వి రమణరాజు ఆధ్వర్యంలో సోమలింగాపురంలోను, మండల వైసిపి అధ్యక్షులు కోట్ల విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో చిన బంటుపల్లి లోను, మండల జె సి ఎస్‌ కన్వీనర్‌ రాము ఆధ్వర్యంలో మండల కేంద్రంలోనూ, బైరిపురం గ్రామ సర్పంచ్‌ పప్పల కృష్ణమూర్తి, మండల వైస్‌ ఎంపిపి కందుల పార్వతి ఆధ్వర్యాన పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. నెల్లిమర్ల : నగర పంచాయతీలో డాక్టర్‌ బొత్స సందీప్‌ జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక గాంధీనగర్‌ కాలనీలో వైసిపి జిల్లా కార్యదర్శి గంటా సతీష్‌, పట్టణ మహిళా నాయకులు గంటా గౌరీదేవి ఆధ్వర్యంలో పేదలకు బట్టలు పంపిణీ చేశారు. కొత్తవలస : వాగ్దేవి కళాశాలలో బొత్స సందీప్‌ బాబు పుట్టినరోజు వేడుకలను కరస్పాండెంట్‌ కోటిన మహేశ్వరరావు ఆధ్వర్యాన ఘనంగా నిర్వహించారు. అనంతరం కొత్తవలసలో చైతన్య బధిరుల మానసిక వికలాంగుల పాఠశాలలో పిల్లలకు అల్పాహారం, అన్నదాన కార్యక్రమం చేశారు. కళాశాల ప్రాంగణంలో, కొత్తవలస జంక్షన్‌లో 100 మందికి వస్త్రదానం చేశారు.

➡️