చంద్రబాబుతోనే భవిష్యత్తుకు భరోసా

Jan 25,2024 20:14

  ప్రజాశక్తి-గరివిడి  : చంద్రబాబుతోనే రాష్ట్ర భవిష్యత్తుకు భరోసా అని చీపురుపల్లి నియోజకవర్గ ఇన్చార్జి కిమిడి నాగార్జున అన్నారు. గురువారం దువ్వాం గ్రామంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా టీడీపీ మేనిఫెస్టో కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేశారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మేనిఫెస్టోలో ప్రకటించిన మహాశక్తి పథకం రాష్ట్ర మహిళలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని చెప్పారు. ప్రతీ మహిళకు రూ.1500 ఆర్థిక సహాయం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు వంటి ఉచిత పథకాలతో వైసిపి నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. కచ్చితంగా ఈ పథకాలు మహిళలను ఆదుకుంటాయని తెలిపారు. రానున్న ఎన్నికల్లో టిడిపికి అత్యధిక మెజారిటీ రావడం ఖాయమని చెప్పారు. కార్యక్రమం లో పైల బలరాం, సారేపాక సురేష్‌ బాబు, వాలే చిట్టయ్య, పిన్నింటి అప్పారావు, కలిశట్టి జోగినాయుడు, బొంతు రామునాయుడు,మహంతి రమణ మూర్తి, యజ్జిపరపు సత్యం, శనపతి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

➡️