చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి

ప్రజాశక్తి-శింగరాయకొండ : చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందు తుందని కొండపి ఎమ్మెల్యే డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి తెలిపారు. శింగరాయకొండ పంచాయతీ పరిధి లోని దాచర్ల ఆంజనేయులు కాలనీలో బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. తొలుత టిడిపి జెండాను ఎగుర వేశారు. అనంతరం ఆర్‌టిసి బస్టాండ్‌, జివిఆర్‌ రోడ్డు, మసీదు వీధి, కందుకూర్‌ రోడ్డులో ఇంటింటికీ తిరిగి మహిళలతో మాట్లాడారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకొస్తే అమలు చేసే పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్ర మంలో టిడిపి నాయకులు వేల్పుల సింగయ్య, చీమకుర్తి కృష్ణ, కూనపు రెడ్డి వెంకట సుబ్బారావు, మాజీ వైస్‌ ఎంపిపి కూనపురెడ్డి హైమావతి, వార్డు సభ్యురాలు ఆలా నాగమణి, ఓలేటి రవిశంకర్‌ రెడ్డి, షేక్‌ సంబానీ బాషా, సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు, చిగురుపాటి శేషగిరి పాల్గొన్నారు.

➡️