చంద్రబాబు మోసకారి : డిప్యూటీ సిఎం

Feb 3,2024 21:03

ప్రజాశక్తి – మక్కువ : రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక మోసగించిన మోసకారిగా చంద్రబాబు అని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర విమర్శించారు. స్థానిక జడ్పీ పాఠశాల ఆవరణలో ఆసరా మహిళలకు రుణమాఫీ చెక్కులను శనివారం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవరత్నాలతో ప్రజలకు జనరంజకమైన పాలన అందించిన ఘనత సిఎం జగన్మోహన్‌రెడ్డిదేనని అన్నారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి మళ్లీ అబద్ధాల ప్రచారంతో ప్రజలను మోసగించేందుకు బయలుదేరుతుందని, వాటిని నమ్మొద్దని మహిళలకు సూచించారు. మళ్లీ వైసిపి అధికారంలోకి తప్పక వస్తుందనిధీమా వ్యక్తం చేశారు. ఎలాంటి అవినీతికి తావు లేకుండా నేరుగా అన్ని సంక్షేమ పథకాలు ప్రజలు ఖాతాలోకి జమ అవుతున్నాయన్నారు. రానున్న ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని మహిళలను కోరారు.మూడు పదవులు పొంది చేసింది ఏమిటి..?2014-19 మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో కొనసాగిన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్సీ సంధ్యారాణి మూడు పదవులు ఉన్నప్పటికీ ప్రజలకు ఏ విధమైన ఉపకారం చేయలేదని రాజన్నదొర విమర్శించారు. శనివారం మక్కువలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపి నాయకులు వ్యక్తిగత విమర్శలు చేస్తే అంతే ధీటుగా తాము కూడా సమాధానం చెబుతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము చేసిన అభివృద్ధి గణాంకాలతో సహా వివరిస్తామని గతంలో ఎన్నోసార్లు చెప్పామన్నారు. తప్పుడు మాటలతో తమ అనుకూల మీడియాలో ప్రచారం చేస్తూ ఉండడాన్ని ఆయన ఖండించారు. ఎస్టి కమిషన్‌ ఆరేళ్లు ఎమ్మెల్సీ పదవులు చేపట్టిన సంధ్యారాణి గానీ, అంతకుముందు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన భంజ్‌దేవ్‌ గాని సాలూరు నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి గురించి బహిరంగంగా చెప్పాలని ఆయన సవాల్‌ విసిరారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు రంగునాయుడు, జెడ్‌పిటిసి శ్రీనివాసరావు, ఎంపిపి పారమ్మ, ఎంపిడిఒ దేవకుమార్‌, ఎటిఎం సన్నిబాబు, పలు పంచాయతీల సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, వివిధ గ్రామాల కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.వీరఘట్టం: అందరికీ న్యాయం చేసేలా పాలన అందిస్తున్నామని, స్థానిక ఎమ్మెల్యే వీ కళావతి ఎమ్మెల్సీ పి విక్రాంతులు అన్నారు. మండల కేంద్రంలోని నాలుగో విడత వైయస్సార్‌ అసరా కానుక పంపిణీ కార్యక్రమం పాల్గొని మాట్లాడారు. అనంతరం 15 వేల పైచిలుక డ్వాక్రా సంఘ సభ్యులకు రూ.9 కోట్లు పైబడి అసరా చెక్కును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి డి వెంకటరమణ నాయుడు, జడ్పిటిసి జంపు కన్నతల్లి ఉమామహేశ్వరరావు, వైస్‌ ఎంపిపి పి విజయకుమారి, పిఎసిఎస్‌ అధ్యక్షులు కె.గోవిందరావు , వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్‌ కె.లీల ప్రసాద్‌ , ఎంపిడిఒ ఎస్‌. సాల్మన్‌ రాజు, తహశీల్దార్‌ సిహెచ్‌ సత్యనారాయణ, మండల మహిళా అధ్యక్షులు పి సుజాత, డ్వాక్రా సంఘ సభ్యులు పాల్గొన్నారు.

➡️