చట్టాలపై అవగాహన అవసరం : జడ్జి

ప్రజాశక్తి – కడప ప్రతి ఒక్కరికీ ప్రజా వినియోగిత సేవల చట్టాలపై అవగాహన అవసరమని పర్మినెంట్‌ లోక్‌ అదాలత్‌ అందించే తీర్పు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుతో సమానమని, పర్మనెంట్‌ లోక్‌ అదాలత్‌ చైర్మన్‌ స్వర్ణ ప్రసాద్‌ పేర్కొన్నారు. శనివారం స్థానిక ఎస్‌.వి. ఇంజినీరింగ్‌ కళాశాల సెమినార్‌ హాల్లో ‘శాశ్వత లోక్‌ అదాలత్‌’ ఆధ్వర్యంలో ప్రజా విని యోగిత సేవా రంగాల్లో న్యాయ సేవలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘పర్మనెంట్‌ లోక్‌ అదాలత్‌” అనే వ్యవస్థ ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం కల్గిన వారందరికి ఎలాంటి కోర్టు ఖర్చులు లేకుండా సత్వర న్యాయ పరిష్కారం అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేశామని తెలిపారు. మరిన్ని పూర్తి వివరాలకు జిల్లా కోర్టు ఆవర ణలోని పర్మనెంట్‌ లోక్‌ అదాలత్‌ కార్యాలయంలో కానీ, 8639684279, 99637 316 98లలో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌.వి. ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సి పల్‌ డాక్టర్‌ ఆర్‌. వీర సుదర్శనరెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు, లెక్చరర్లు, సిబ్బంది, లోక్‌ అదాలత్‌ సభ్యులు ఎం. వి సుబ్బారెడ్డి, ఎం. ఆదినారాయణ, పాల్గొన్నారు.

➡️