చదురుగుడిలోకి పోలమాంబ

Jan 8,2024 21:20

ప్రజాశక్తి -మక్కువ : ఉత్తరాంధ్ర ఆరాధ్య దేవత పేరుంది రాష్ట్ర జాతరగా అవతరించిన శంబర పోలమాంబ అమ్మవారిని భక్తిశ్రద్ధలతో సోమవారం రాత్రి వనం గుడి నుండి గ్రామంలో గల చదురు గుడిలోకి తీసుకొచ్చారు ఆలయ కార్యనిర్వహణాధికారి వివిఎస్‌ నారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పటి నుంచి ఈనెల 22, 23, 24వ తేదీల్లో పాలమాంబ మొదటి వారం జాతర ఘనంగా జరగనుంది. మరల అమ్మవారిని రెండో వారం నుండి 10 వారాల పాటు వనం గుడిలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు 9 వారాల పాటు ఇక్కడే జాతర జరగనుంది సోమవారం రాత్రి జరిగిన కార్యక్రమానికి స్థానిక గ్రామ పెద్దలు ఎంపిటిని సభ్యులు పోలినాయుడు, జన్నిపేకాపు కుటుంబ సభ్యులు, గెరడ కుటుంబీకులు పాల్గొన్నారునేడు రెండోవిదత సమీక్షశంబర పోలమాంబ అమ్మవారి జాతరకు సంబంధించి పార్వతీపుర్లం ఆర్డీవో హేమలత ఆధ్వర్యంలో మంగళవారం సమీక్ష సమావేశం జరగనుంది. ఈ సమీక్షకు అన్ని శాఖల అధికారులు పాల్గొనన్నారు. జాతర ఏర్పాట్లకు సంబంధించి ఈ సమీక్షలో చర్చించనున్నారు. చదురు గుడి సమీపంలో జరిగే ఈ సమావేశానికి అందరూ విధిగా హాజరుకావాలని ఆలయ కార్య నిర్వహణ అధికారి వివిఎస్‌ నారాయణ కోరారు.

➡️