చలివేంద్రం ఏర్పాటు

Mar 25,2024 21:44
ఫొటో : చలివేంద్రం ప్రారంభిస్తున్న దగ్గుపాటి రవి

ఫొటో : చలివేంద్రం ప్రారంభిస్తున్న దగ్గుపాటి రవి
చలివేంద్రం ఏర్పాటు
ప్రజాశక్తి-వరికుంటపాడు : మండలంలోని పెద్దిరెడ్డిపల్లి బస్టాండ్‌ సెంటర్లో తన తండ్రి దగ్గుపాటి వెంకటేశ్వర్లు జ్ఞాపకార్థంగా దగ్గుపాటి రవి సోమవారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాల దృష్ట్యా ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారనే దృక్పథంతో ఈ చలివేంద్రం ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. తొలుత మజ్జిగతో ప్రారంభించి అక్కడికి వచ్చిన వారందరికీ తన చేతుల మీదుగా మజ్జిగను అందజేశారు. ఈ చలివేంద్రం వేసవికాలం అంతా కొనసాగిస్తామన్నారు.

➡️