చిన్నపాలెం మసీదుకు వందేళ్లు

చిన్నపాలెం మసీదు

 

– రేపు ప్రత్యేక వార్షికోత్సవ వేడుక

– శ్రీలంక, మహారాష్ట్ర నుంచి మత పెద్దల రాక

-వైభవంగా నిర్వహణకు కమిటీ ఏర్పాట్లు

ప్రజాశక్తి – గాజువాక : జివిఎంసి 77వ వార్డు, పెదగంట్యాడ మండలం, చిన్నపాలెం గ్రామంలో నూర్‌-ఇ-జామియా మసీదును నిర్మించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆదివారం ముస్లిమబాద్‌లో వేడుకను నిర్వహించేందుకు మసీదు కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. 1924 జనవరిలో అప్పటి ముస్లిం పెద్దలు ఈ మసీదును నిర్మించారు. వందేళ్ల వేడుకలో భాగంగా నవజవాన్‌ ముస్లిమాబాద్‌ యూత్‌ ఆధ్వర్యంలో మసీద్‌ అంతటా డిజిటల్‌ లైటింగ్‌తో దేదీప్యమానంగా అలంకరించారు. మహారాష్ట్ర, శ్రీలంక నుంచి ముస్లిం మతపెద్దలు వేడుకలో పాల్గొని మహ్మద్‌ప్రవక్త సందేశాన్ని ఇస్తారు. ఆదివారం సాయంత్రం మసీద్‌లో ఖురాన్‌ పఠనం, బయాన్‌ కార్యక్రమం అనంతరం విందు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక నమాజ్‌ ప్రార్థనలు చేయాలని గ్రామ పెద్దలు పిలుపునిచ్చారు. జిల్లాల్లోని అన్ని మసీదులకు ఇప్పటికే ప్రత్యేక ఆహ్వానాలు పంపారు. మసీదు వందేళ్ల వేడుకను విజయవంతం చేయాలని మసీదు కమిటీ కోరింది.

చిన్నపాలెం మసీదు

➡️