చెప్పులు కుడుతూ మున్సిపల్‌ కార్మికుల ఆందోళన

కడప అర్బన్‌ : సిఎం జగన్మోహన్‌ రెడ్డికి కళ్ళు తెరిపించాలని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ నాయకులు విజ్ఞప్తి చేశారు. సోమవారం మున్సిపల్‌ కార్మికుల సమ్మె 7వ రోజుకు చేరుకుంది. కార్పొరేషన్‌ ఎదుట ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. గాంధీ విగ్రహానికి మున్సిపల్‌ కార్మికులు నీళ్లతో కడిగి పులిదండ వేశారు. ఈ సందర్భంగా ఆదాము మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి నాలు గున్నరేళ్లవుతున్నా జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీ సాక్షి ఇచ్చిన హామీని అమలు చేయడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు. కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది అందరినీ పర్మినెంట్‌ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పని సమాన వేతనం ఇవ్వాలని ఇంజి నీరింగ్‌ సెక్షన్లో పనిచేస్తున్న కార్మికులకు స్కిల్డ్‌, సెమి స్కిల్డ్‌ వేతనాలు ఇవ్వాలని కోరారు. క్లాప్‌ డ్రైవర్లకు కనీస వేతనం రూ.18,500 ఇవ్వాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సుంకర రవి, కంచుపాటి తిరుపాల్‌, గోపి, సుంకర కిరణ్‌, పి.సి.సుబ్బయ్య, అజీముద్దీన్‌, రాముడు, సుంకన్న, నాగయ్య, నాగరాజు , కార్మికులు పాల్గొన్నారు. బద్వేలు : కార్మికులకు జగనన్న ఇచ్చిన హామీలు అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మె 7రోజులో భాగంగా బద్వేల్‌ మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌( సిఐటియు) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ మున్సిపల్‌ కార్యాలయం వద్ద చెప్పులు కుడుతూ తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి కె.శ్రీనన్న మాట్లాడుతూ ఆనాడు మున్సిపల్‌ కార్మికులను పొగడ్తలతో ముంచేత్తిన పాలకులు నేడు వారిపై దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటని వాపోయారు. పారిశుధ్య కార్మికులకు లక్ష రూపాయలు జీతం ఇచ్చిన తక్కువేనని మాట్లాడిన జగన్మోహన్‌ రెడ్డి నేడు వేతనాల పెంపుపై పెదవి విరచడం శోచనీయమని వాపోయారు. 2023 వ సంవత్సరం కార్మిక ప్రజా ఉద్యమాలతో ముగిస్తుందని, 2024వ సంవత్సరం కార్మిక నిరసనలతో ప్రారంభమవుతుందని, కనీసం కొత్త సంవత్సరంలోనైనా ప్రభుత్వం కార్మికుల సమ్మెకు ముగింపు పలికి కోర్కెలు అంగీ కరించాలని లేనియెడల ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఐద్వా మహిళా సంఘం జిల్లా కమిటీ సభ్యులు గౌతమి, పట్టణ అధ్యక్షురాలు అనంతమ్మ, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ముడియం చిన్ని, వడ్డెర వత్తిదారుల సంఘం పట్టణ నాయకులు గంప సుబ్బరాయుడు, సిఐటియు పట్టణ నాయకులు రాజగోపాల్‌, యూనియన్‌ పట్టణ అధ్యక్షులు పులి శ్యాం ప్రవీణ్‌, కార్యనిర్వాహక అధ్యక్షుడు దియ్యాల హరి, ఉపాధ్యక్షులు దియ్యాల దేవమ్మ, గంటా శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి దియ్యాల నాగేంద్రబాబు, కార్యదర్శులు నాగరపు సత్యరాజు, బద్వేల్‌ ప్రవీణ్‌ కుమార్‌, నేల టూరు పాలయ్య, కోశాధికారి కాలువ శివకుమార్‌ కమిటీ సభ్యులు పద్మిశెట్టి రామయ్య, ఇండ్ల చంద్రశేఖర్‌, తేళ్ల కిరణ్‌ పాల్గొన్నారు. ప్రొద్దుటూరు : తమ న్యాయమైన కోర్కెలు సాధించుకునేంత వరకు పోరాటం అపమని మున్సిపల్‌ కార్మికుల స్పష్టం చేశారు. అపరిషృత కోర్కెల పరిష్కారం కోరుతూ మున్సిపల్‌ కార్మికుల సంఘం (సిఐటియు అనుబంధం) ఆధ్వర్యంలో కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె సోమవారానికి ఏడవ రోజుకు చేరుకుంది. నూతన సంవత్సర పండుగపూట ధర్నా ప్రదేశంలోనే కేక్‌కట్‌ చేసి అక్కడే బోజనాలు చేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో సంఘ గౌర వాధ ్యక్షులు సత్యనారాయణ, కార్యదర్శి సాల్మన్‌, సిఐటియు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, ధర్నా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు చంటి కోశాధికారి రాఘవేంద్ర కార్మికులు పాల్గొన్నారు.

➡️