చెరువుల ఆక్రమణపై వినతి

ప్రజాశక్తి – ముసునూరు

ముసునూరు గ్రామంలో చెరువులన్నీ ఆక్రమణకు గురయ్యాయని గ్రామస్తులు తహశీల్దార్‌కి వినతిని అందజేశారు. ఆదివారం మండల కేంద్రమైన ముసునూరు గ్రామానికి చెందిన మానిక్యాల సాంబశివరావు పలువురు గ్రామస్తులతో కలిసి గ్రామంలోని చెరువులన్నీ ఆక్రమణకు గురైయ్యాయని జిల్లా కలెక్టర్‌కు తెలిపి, చెరువులను ఆక్రమణదారుల నుంచి కాపాడాలని తహశీల్దార్‌ను కోరారు.

➡️