చెవిలో పువ్వులు.. మోకాళ్లపై నిలబడి

అంగన్వాడీలు 12వ రోజు శనివారం పలుచోట్ల వినూత్నంగా తమ నిరసన తెలిపారు. కలిదిండిలో చెవిలో పూలు పెట్టుకుని, ముసునూరులో మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. జీలుగుమిల్లిలో మెడలో ఎర్రకండువాలు వేసుకుని నినదించారు. ఏలూరులోని సమ్మె శిబిరాన్ని ఎంఎల్‌సి ఐ.వెంకటేశ్వరావు సందర్శించి మద్దతు తెలిపారు. చింతలపూడిలో జరిగిన సమ్మెలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి, ఉంగుటూరులో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్‌.లింగరాజు పాల్గొన్నారు. నిడమర్రులో విఒఎల మండల కమిటీ బృందం సమ్మెకు మద్దతు తెలిపింది. జిల్లాలోని అన్నిమండలాల్లో అంగన్వాడీలు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. -వార్త 6లో..

➡️