జగనన్నా నీకో దండం

Jan 10,2024 21:38

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : ఎన్నికల ముందు సిఎం జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన ఏమైందని అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నెల రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించక పోవడంపై భగ్గుమంటున్నారు. అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన హామీ ఏమైందని నిలదీస్తున్నారు. ప్రభుత్వ మొండి వైఖరికి వ్యతిరేకంగా వినూత్న రీతుల్లో నిరసనలు తెలియజేస్తున్నారు. జిల్లాలో అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన చేపట్టిన బుధవారం 30వ రోజుకు చేరింది. అంగన్వాడీలకు సిపిఎం, కార్మిక, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న సమ్మెలో భాగంగా 30వ రోజు పార్వతీపురం కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన నిరాహార దీక్ష బుధవారం విజయవంతంగా కొనసాగింది. వీరికి సిపిఎం జిల్లా కమిటీ నాయకులు ఎం.తిరుపతిరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మన్మథరావు, ఉపాధ్యక్షులు వి.ఇందిర, పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి పాకల సన్యాసిరావు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ, పట్టణ నాయకులు బొత్స లక్ష్శి, అంగన్వాడి యూనియన్‌ జిల్లా కార్యదర్శి గంటా జ్యోతి పాల్గొన్నారు.గుమ్మలక్ష్మీపురం : గుమ్మలక్ష్మీపురంలో అంగన్వాడీలు మోకాళ్లపై కూర్చుని దండాలు పెడుతూ నిరసన తెలిపారు. అంగన్వాడీ యూనియన్‌ ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు సత్యవతి, కస్తూరి పాల్గొన్నారు.బలిజిపేట : అంగన్వాడీల సమ్మెకు ఎపిటిఎఫ్‌ మండల కార్యదర్శి గుల్ల రామారావు సంఘీభావం తెలిపారు.గరుగుబిల్లి : మండలం కేంద్రంలో సమ్మె శిబిరం వద్ద ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయినందుకు తమ చెప్పుతో తాము కొట్టుకొని అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి బివి రమణ పాల్గొన్నారు.సాలూరు : పట్టణంలో సమ్మె శిబిరం వద్ద సిఎం జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటం ఎదుట అంగన్వాడీలు సాష్టాంగ నమస్కారాలతో నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు ఎ.నారాయణమ్మ, శశికళ, తిరుపతమ్మ, పార్వతి, సుభద్ర, అరుణ పాల్గొన్నారు.కురుపాం : మండల కేంద్రంలో ప్రధాన రహదారి వద్ద సమ్మె 30 రోజులకు చేరిన నేపథ్యంలో 30 ఆకారంలో అంగన్వాడీలు కూర్చుని నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు పి.సరళ కుమారి, ప్రాజెక్టు కార్యదర్శి జె.సరోజ పాల్గొన్నారు.సీతానగరం : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట సమ్మె శిబిరం వద్ద 30 అంకె ఆకారంలో కూర్చుని అంగన్వాడీలు నిరసన తెలిపారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు మడక సత్యవతి, ఎం.యశోద, ఎస్‌.అరుణ, పి.పద్మ, ఆర్‌.లక్ష్మి, సిఐటియు నాయకులు జి. వెంకటరమణ, రామారావు, ఈశ్వరరావు పాల్గొన్నారు.సీతంపేట : సీతంపేట ఐటిడిఎ ఎదుట సమ్మె శిబిరాన్ని అంగన్వాడీలు కొనసాగించారు. వీరికి టిడిపి నాయకులు దమయంతి నాయుడు, ఎస్‌టి సెల్‌ రాష్ట్ర కన్వీనర్‌ చందర్రావు, మాజీ ఎంపిపి మల్లయ్య, సూర్యారావు, జెఎసి కన్వీనర్‌ జనార్దనరావు మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి ఎం.కాంతారావు, సీనియర్‌ కార్యకర్తలు ఎ.శాంతికుమారి, తదితరులు పాల్గొన్నారు.కొమరాడ : కొమరాడలో అంగన్వాడీలు వివిధ రకాల ప్రార్థనలు చేస్తూ నిరసన తెలిపారు. అంగన్వాడీ యూనియన్‌ ప్రాజెక్టు కార్యదర్శి సిరికి అనురాధ, సెక్టార్‌ లీడర్లు బి.అలివేలు, జ్యోతి, పద్మ, లలిత, భారతి, జయమ్మ, సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర్తి పాల్గొన్నారు.భామిని : భామిని మండల కేంద్రంలో అంగన్వాడీలు 30 సంఖ్యలో కూర్చొని నిరసన తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ జిల్లా కార్యదర్శి హైమప్రభ, సిఐటియు నాయకులు కె.మిన్నారావు, ప్రసాద్‌, ధర్మారావు పాల్గొన్నారు.

➡️