జగనన్న ఆరోగ్య సురక్ష ప్రజలందరికీి రక్ష

Feb 27,2024 21:15

ప్రజాశక్తి – కొత్తవలస : వియ్యంపేట పిహెచ్‌సి పరిధిలో గల అప్పన్నపాలెం పంచాయతీలో జగనన్న సురక్ష మెగా వైద్య శిభిరం సర్పంచ్‌ కోన దేముడు, సెక్రటరీ అప్పారావు ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఇందులో భాగంగా 315 మందికి వైద్య సేవలు అందించినట్లు వైద్యాధికారి డాక్టర్‌ ఇ.గోపాలకృష్ణ తెలిపారు. జగనన్న సురక్ష శిభిరంలో బీపీ, షుగర్‌, హెచ్‌.బి, యూరిన్‌ టెస్ట్స్‌, మలేరియా, డెంగీ, టీబీ స్పూటమ్‌ టెస్ట్స్‌ చేసి అందరికి ఉచితంగా మందులు అందజేశారు. శంకర్‌ ఫౌండేషన్‌ ఆసుపత్రి వైద్యులు డాక్టర్‌ జ్యోతి ప్రియాంక 72 మందికి కళ్ళు తనిఖీ చేసి 12 మందికి కంటి ఆపరేషన్‌కి రిఫర్‌ చేసినట్లు తెలిపారు. ఆర్థోపెడిక్స్‌ డాక్టర్‌ జి. రవి తేజ 57 మందికి తనిఖీ చేసి ఇద్దరినీ కేజీహెచ్‌కి రిఫర్‌ చేశారు. స్త్రీ వైద్య నిపుణులు కె. జ్యోతిర్మయి 44 మందికి తనిఖీ చేయగా నలుగుర్ని ఎస్‌. కోట ఏరియా ఆసుపత్రికి రిఫర్‌ చేసినట్లు తెలిపారు. జనరల్‌ ఒపీ 94 మందికి డాక్టర్‌ గోపాలకృష్ణ తనిఖీ చేసినట్లు తెలిపారు. జగనన్న సురక్ష క్యాంపులో అప్పన్న పాలెం, దత్తి, ధన్నినపేట, జిందాల్‌ వర్కర్స్‌కి వైద్య సేవలు అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిమ్మలపాలెం వైసిపి నాయకులు కె. శ్రీనివాసరావు, ఆతవ రమేష్‌, పి. నాగేశ్వరావు, బి. అప్పలనాయుడు, పీహెచ్సి సిబ్బంది, సచివాలయం సిబ్బంది, వాలంటీర్స్‌ పాల్గొన్నారు.వేపాడ: మండలంలోని పాటూరులో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరానికి 450 తనిఖీలు నిర్వహించారు. రోగ నిర్ధారణ బట్టి వారికి అవసరమైన మందులను ఉచితంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ ఎల్‌ రమాదేవి, డాక్టర్‌ కృష్ణవేణి, డాక్టర్‌ కోటేశ్వరరావు, డాక్టర్‌ కృష్ణకుమారి, పంచాయతీ కార్యదర్శి సంధ్య, అభినవ్‌ నర్సింగ్‌ హౌమ్‌ ఈశ్వర్‌రావు వైద్య సిబ్బంది పాల్గొన్నారుమెరక ముడిదాం: మండలంలోని బైరిపురం సచివాలయంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని విశేష స్పందన లభించింది. 309 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. శస్త్ర చికిత్సలు అవసరమైన వారిని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి వారికి ఉన్నతమైన వైద్య సదుపాయం కల్పించనున్నట్లు గర్భాం పిహెచ్‌సి వైద్యులు అజరు కుమార్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ పప్పల విజయకుమారి, ఉపసర్పంచ్‌ పప్పల క్రిష్ణమూర్తి, వైసిపి నాయకులు పప్పల గ్రహణేశ్వరరావు, ఎంఎల్‌హెచ్‌పి గాయత్రి, వరలక్ష్మి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

➡️