జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలి

ప్రజాశక్తి – కొండాపురం రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రిగా వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డి ఎంతో అవసరమని జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్‌ మూలె సుధీర్‌రెడ్డి తెలిపారు. సోమవారం కొండాపురం మండలం కేంద్రంలో తొలుతగా వైసిపి జెండా ఎగుర వేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ అంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చిన ఆనాటి పాలకులు రాష్ట్ర సంక్షేమం- అభివద్ది గురించి ఆలోచనలు చేయకుండా తప్పుడు విధానాలను అనుసరించి ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన సొమ్మును దోచుకుని పంచుకున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల బాగోగులు చూడలేదని, సంక్షేమాన్ని గాలికి వదిలేశారని చెప్పారు. జగన్మోహనరెడ్డి 2019 ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన నవరత్నాలను అమలు పరచారని, కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకున్నారని పేర్కొన్నారు. జగన్మోహనరెడ్డి నాలుగున్నర సంవత్సరాల పరిపాలనా కాలంలో కొండాపురం పట్టణానికి ప్రత్యక్ష నగదు బదిలీ కింద రూ. 20,63,18,048 కోట్లు , పరోక్ష ప్రయోజనాలు ఇంటి స్థలాలు, విద్యాకానుక, బైజూస్‌ కంటెంట్‌ ట్యాబ్‌లు జగనన్నతోడు ,గోరుముద్ద, సంపూర్ణ పోషణ, కంటివెలుగు, రేషన్‌, పింఛన్లు వంటి అభివృద్ధి పనులు చేశారని చెప్పారు. కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి నాగ ప్రసాద్‌, తహశీల్దార్‌, శోభన్‌ బాబు, ఎస్‌ఐ యోగేంద్ర, ఇతర అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️