‘జగన్‌ కోర్టుకు రావాలి’

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌: కోడి కత్తి శ్రీను కేసులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కోర్టుకు రావాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు డిమాండ్‌ చేశారు. కోడి కత్తి శీను కేసును జగన్‌ ప్రభుత్వం ఉపసంహరించు కోవాలనే డిమాండ్‌తో ఒంగోలులోని దళిత హక్కుల పరిరక్షణ సమితి కార్యాలయం వద్ద సోమవారం నిరసన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు దారా అంజయ్య, తానికొండ ఆనంద్‌, కాకుమాను రవి, పాలేటి శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.

➡️