జయకృష్ణకే టికెట్‌ ఇవ్వాలి

Mar 8,2024 21:46

 ప్రజాశక్తి – వీరఘట్టం : పాలకొండ నియోజకవర్గం టికెట్టు నిమ్మక జయకృష్ణకే ఇవ్వాలని అరకు పార్లమెంటరీ బిసి సెల్‌ కన్వీనర్‌ పి.కృష్ణమూర్తి నాయుడు, మండల అధ్యక్షులు ఉదయాన ఉదరు భాస్కర్‌, పట్టణ అధ్యక్షులు జామి లక్ష్మీనారాయణ డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక జామి వారి కాంప్లెక్స్‌లో ప్రెస్‌ మీట్‌ కార్యక్రమంలో మాట్లాడారు. సర్వేలో అనుకూలంగా ఉన్నందున జయకృష్ణ నియోజకవర్గం టికెట్టు ఇస్తే 15వేల మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇచ్చారు. పాలకొండలో టిడిపి గెలిచే అవకాశాలు క్లియర్‌గా ఉన్నప్పటికీ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌, రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెంనాయుడు పునఃపరిశీలన జరిపి జయకృష్ణకు ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. జయకృష్ణకు టికెట్టు ఇవ్వకపోతే రోడ్డెక్కుతామన్నారు. కార్యక్రమం లో సీనియర్‌ నాయకులు పి.నాగేశ్వరరావు, బి.హరిబాబు, ఎన్‌.శేషకుమార్‌, సిహెచ్‌ ఉమామహేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. పాలకొండ : టిడిపి నియోజకవర్గ ఇన్‌-ఛార్జ్‌ నిమ్మక జయకృష్ణకు ఒక్క అవకాశం ఇవ్వాలని టిడిపి నాయకులు కోరారు. టిడిపి కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. గడిచిన నాలుగున్నర సంవత్సరాలలో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు అనేక కార్యక్రమాలు నిర్వహించారని, ప్రజల్లోని, నాయకుల్లోని జయకృష్ణ ఉన్నారని నాయకులు అన్నారు. జయకృష్ణకు టికెట్‌ ఇస్తే అత్యంత మెజారిటీతో గెలుస్తారని నాయకులు అభిప్రాయపడ్డారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు గండి రామినాయుడు, పట్టణ పార్టీ అధ్యక్షులు గంటా సంతోష్‌, వెన్నపు శ్రీనివాస్‌ రావు, సుంకరి అనీల్‌, తదితరులు ఉన్నారు.భామిని : పాలకొండ టిడిపి ఇన్‌ఛార్జి జయకృష్ణకే టిక్కెట్టు కేటాయించాలని మండల టిడిపి అధ్యక్షులు భోగాపురపు రవినాయుడు డిమాండ్‌ చేశారు. మండలం టిడిపి కమిటీ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి మెడిబోయిన జగదీశ్వరరావు మాట్లాడుతూ, జయకృష్ణ తండ్రి నిమ్మక గోపాలరావు ఎమ్మెల్యేగా నిరంతరం పాలకొండ నియోజక వర్గ ప్రజలకు సేవలందించారు. అదే తరహాలో జయకృష్ణ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం శ్రమిస్తున్నారు. కావున పాలకొండ ఎమ్మెల్యే టిక్కెట్‌ జయకృష్ణకే కేటాయించాలని కోరారు. సమావేశంలో మండలం కమిటీ సభ్యులు బిడ్డికి ప్రసాద్‌, సాకేటి రామారావు, నిమ్మల కోర, కోరాడ రాజేష్‌, అశోక్‌, లక్ష్మీపతి ఉన్నారు.

➡️