జాతీయ బాక్సింగ్‌ పోటీలకు అండర్‌ 17,19 జట్లు

Jan 1,2024 19:49

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : అండర్‌ 17,19 బాక్సింగ్‌ రాష్ట్రస్థాయి టీములు జాతీయస్థాయి పోటీలలో పాల్గొనేందుకు సోమవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లాయి. ఈ పోటీలు జనవరి 3 నుంచి 8 తేదీ వరకు ఢిల్లీ లోని త్యాగరాజ స్టేడియంలో జరుగనున్నాయి. మొత్తం రెండు విభాగాలలో కలిపి 27 మంది క్రీడాకారులు, కోచ్‌, మెనేజర్లుగా నలుగురు వ్యాయామ ఉపాధ్యాయులు వెళుతున్నారు. ఈ క్రీడాకారులను జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ కన్వీనర్‌, డిఇఒ బి.లింగేశ్వర రెడ్డి ,ఉప విద్యాశాఖ అధికారి కె.వాసుదేవరావు, జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఎల్‌వి రమణ, జిల్లా బాక్సింగ్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ డోల మన్మధ కుమార్‌ అభినందనలు తెలిపారు.

➡️