28 నుంచి గీతంలో అంతర్జాతీయ సదస్సు

Jun 25,2024 23:45 #Gitam, #international sadassu, #poster
Gitam, International sadassu poster

ప్రజాశక్తి -మధురవాడ : గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌, ఇంటర్నేషనల్‌ సొసైటీ ఆఫ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఎయిర్‌ అండ్‌ వాటర్‌ సంస్థ సంయుక్తంగా ఈ ఏడాది నవంబర్‌ 28 నుంచి డిసెంబర్‌ 1వ తేదీ వరకు అంతర్జాతీయ సదస్సును నిర్వహించనున్నాయని సదస్సు చైర్మన్‌ ప్రొఫెసర్‌ సాధన్‌ కె ఘోష్‌ తెలిపారు. గీతం స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ డీన్‌ ప్రొఫెసర్‌ రాజా పి.పప్పు, సదస్సు కన్వీనర్‌ డాక్టర్‌ వైఎల్‌పి.తోరణితో కలిసి మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడిరచారు. వివిధ రకాల పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు, పట్టణాలు, రోజువారి జీవితంలో వినియోగించే ప్లాస్టిక్‌, ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు, ఆసుపత్రి వ్యర్థాలను తిరిగి వినియోగించే రీసైకిలింగ్‌ పద్దతులతో కొత్త ఆర్థిక వ్యవస్థను సృష్టించడాన్ని సర్క్యులర్‌ ఎకానమి అంటారని తెలిపారు. సస్టైనబుల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ -సర్క్యులర్‌ ఎకానమి, ఐపిఎల్‌ఎ గ్లోబల్‌ ఫోరమ్‌ -2024 పేరిట జరిగే ఈ సదస్సులో 60 దేశాల నుంచి 1000 మంది ప్రతినిధులు హజరు కానున్నారని, 400కు పైగా పరిశోధన పత్రాలను వివిధ రంగాల నిపుణులు సమర్పించనున్నారని తెలిపారు. సదస్సులో భాగంగా నవంబర్‌ 27వ తేదీన స్కూల్‌ చిల్డ్రన్‌ కాంగ్రెస్‌ నిర్వహిస్తున్నామని, దీనికి దేశంలోని 600 పాఠశాల విద్యార్థులు హజరు కానున్నారని తెలిపారు. సదస్సులో భాగంగా పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన ఉంటుందని తెలిపారు. గీతంతో కలిసి పలు వ్యర్థ పదార్థాల నిర్వహణ ప్రాజెక్టులను చేపడతామని ఆయన వెల్లడిరచారు. ఈ సదర్భంగా సదస్సు గోడ పత్రికను, ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు.

➡️