జాతీయ మహిళా కబడ్డీ పోటీలకు ఇద్దరు ఎంపిక

Dec 10,2023 20:55

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :   ఈనెల 11 నుంచి 15వరకు పంజాబ్‌ రాష్ట్రంలో జరుగనున్న జాతీయ మహిళా కబడ్డీ పోటీలకు జిల్లా నుంచి కె.రామలక్ష్మి, ఎం.భువన ఎంపికయ్యారు. గత నెలలో కర్నూలులో జరిగిన 70వ రాష్ట్రస్థాయి మహిళల అంతర్‌ జిల్లా సీనియర్‌ కబడ్డీ పోటీల్లో విజయనగరం జిల్లా ప్రథమ స్థానం సాధించింది. జట్టును ప్రథమ స్థానంలో నిలబెట్టిన క్రీడాకారులు కె. రామలక్ష్మి ఎం భువన జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. వీరికి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రంగారావు, ప్రభావతి అభినందనలు తెలిపారు.

➡️