జాతీయ స్థాయిలో ‘మిట్స్‌’ విద్యార్థుల ప్రతిభ

ప్రజాశక్తి-మదనపల్లి మదనపల్లి ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌లో బిటెక్‌ – కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగంలో మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఆవిష్కార్‌-స్టూడెంట్‌ ఇన్నోవేషన్‌ కాంపిటిషన్‌ ఫర్‌ స్టార్ట్‌ అప్‌లో ఐడియా ప్రజెంటేషన్‌ ఈవెంట్‌ లో ప్రతిభ కనపరిచి జాతీయ స్థాయిలో విజేతలుగా నిలిచినట్లు కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సి.యువరాజ్‌ తెలి పారు. మంగళగిరి లోని కె.ఎల్‌ యూనివర్సిటీలో జరిగిన పోటీలలో సి.ప్రణతి, లక్ష్మితనూజ, నాగశ్వేతలు ఐడియా ప్రెజెంటేషన్‌ ఈవెంట్‌లో సెమి రోబోటిక్‌ వీడ్‌ కట్టర్‌ అండ్‌ సాయిల్‌ మానిటరింగ్‌ సిస్టంను ప్రదర్శించి నందుకు గాను జాతీయ స్థాయిలో టాప్‌ 3వ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రంతో పాటు జ్ఞాపికను అందించారని చెప్పారు. ప్రతిభ చాటిన విద్యార్థులను కరస్పాండెట్‌ డాక్టర్‌ ఎన్‌.విజయ భాస్కర్‌ చౌదరి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కీర్తి నాదెళ్ల, విభాగాధిపతి డాక్టర్‌ శ్రీదేవి అభినందనలు తెలిపారు.

➡️