జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలకు విద్యార్థిని ఎంపిక

ప్రజాశక్తి-కనిగిరి: గతేడాది నవంబర్‌ 18,19,20వ తేదీలలో గుంటూరు జిల్లా కాకానిలో జరిగిన ఎస్‌జిఎఫ్‌ఐ 14 సంవత్సరాల బాలికల సాఫ్ట్‌ బాల్‌ రాష్ట్ర స్థాయి పోటీలలో ప్రతిభ కనపరచిన దిరిశవంచ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె ప్రసన్న జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు ఎన్‌ జ్యోతిబాబు తెలిపారు. సాఫ్ట్‌ బాల్‌ పోటీలకు ఎంపికైన ప్రసన్న ఫిబ్రవరి మూడో తేదీ నుంచి ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో జరిగే జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలలో పాల్గొన్నట్లు తెలిపారు. పోటీలకు ఎంపికైన కె ప్రసన్నను వ్యాయామ ఉపాధ్యాయుడు ఎన్‌ జ్యోతిబాబును పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి శ్రీనివాసరావు, గణిత ఉపాధ్యాయుడు కె రమణయ్య, పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది అభినందనలు తెలియజేశారు.

➡️