జాయింట్‌ కలెక్టర్‌గా అంబేద్కర్‌

Jan 28,2024 21:38

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌: జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా బిఆర్‌ అంబేద్కర్‌ జిల్లాకు రానున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కమిషన్‌ సూచన మేరకు రాష్ట్రంలో 21 మంది ఐఎఎస్‌ల బదిలీల నేపథ్యంలో ఈ మార్పులు జరిగినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం జెసిగా పనిచేస్తున్న ఆర్‌.గోవిందరావుకు సర్వే సెటిల్‌మెంట్‌ అదనపు డైరెక్టర్‌గా బదిలీ అయ్యింది. ఈనెల జెసి బాధ్యతలు చేపట్టి సుమారు ఏడునెలలు కావస్తుంది. కొత్తగా రాబోతున్న జెసి అంబేద్కర్‌ గతంలో ఆర్‌డిఒగానూ, ఐటిడిఎ పిఒగా పనిచేశారు.

➡️