జాస్మిన్‌కు ద్వితీయ స్థానం

Dec 21,2023 23:27 #జాస్మిన్‌

శింగరాయకొండ : ఒంగోలులోని రైస్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో భారతదేశ విజ్ఞానమండలి అప్‌ కాస్ట్‌ ఆధ్వర్యంలో కౌశల్‌ పోస్టర్‌ ప్రజెంటేషన్‌పై జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో శింగరాయకొండ జిల్లా పరిషత్‌ బాలికలు ఉన్నత పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థిని జాస్మిన్‌ ద్వితీయ స్థానం సాధించినట్లు పాఠశాల ప్రధానో పాధ్యాయురాలు కె.మహాలక్ష్మి తెలిపారు. ఈనెల 30న విజయవాడలో నిర్వహిస్తున్న రాష్ట్ర ఈ పోటీల్లో జాస్మిన్‌ పాల్గొనున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా జాస్మిన్‌, గైడ్‌ ఉపాధ్యాయురాలు గౌరీ సుజాతను అభినందించారు.

➡️