జిఒ 1పై టిడిపి నిరసన  

జిఒ నెంబర్‌ వన్‌ కాపీల ప్రతులను భోగి మంటలో వేస్తున్న ఎంఎల్‌ఎ తదితరులు

ప్రజాశక్తి-మండపేట

పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష నాయకులు చేపట్టే కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన జిఒ నెంబర్‌ వన్‌ కాపీల ప్రతులను ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు భోగిమంటలో వేసి దద్దం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి జిఒలు ఎన్ని తీసుకువచ్చిన భయపడదిలేదన్నారు. ప్రజా హక్కుల కోసం నిరంతరం ప్రభుత్వంపై పోరాడుతామన్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలపై ఎస్మా చట్టం తీసుకురావడం ప్రభుత్వ నిరంకుశ తత్వానికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ చుండ్రు శ్రీవర ప్రకాష్‌, చేకూరి రమేష్‌ రాజు, వాకచర్ల గుప్తా, తెల్లాకుల వేణుగోపాల్‌ పాల్గొన్నారు.

 

➡️