సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

Jun 27,2024 13:16 #Konaseema

మంత్రికి సుబాష్ కు వినతి

ప్రజాశక్తి-రామచంద్రపురం : సమగ్ర శిక్ష అభియాన్ లో వివిధ కేటగిరీలో పనిచేస్తున్న ఉద్యోగులు అందరు సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ని కలిసి జేఏసీ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఎంతో కాలంగా ఎస్ఎస్ ఏ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదని ఈ సందర్భంగా వారు తాము అనేకసార్లు సమస్యలపై సమ్మె చేశామని సమ్మె జీతాలు, ఈపీఎఫ్, ఈఎస్ఐ, పెండింగ్ వేతనాలు గురించి మంత్రికి వివరించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. సంవత్సర పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ సి. హెచ్. వెంకన్న బాబు, ఇతర విభాగాల సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

➡️