జిజిహెచ్‌ శానిటేషన్‌ వర్కర్స్‌ ఆందోళన

Jan 14,2024 00:10
తమ సమస్యలు

ప్రజాశక్తి – కాకినాడ

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కాంట్రా క్ట్‌ శానిటేషన్‌ వర్కర్స్‌ (సిఐటియు) శనివారం ఉదయం ఆసుపత్రి మాతా శిశు విభాగం వద్ద ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా యూని యన్‌ అధ్యక్షుడు సిహెచ్‌ విజరు కుమార్‌ మాట్లాడుతూ గత చాలా కాలంగా జిజిహెచ్‌లో శానిటేషన్‌ వర్కర్స్‌గా కాంట్రాక్టు పద్ధతిలో సేవలు అందిస్తున్నామన్నారు. అయితే ఎన్నడూ లేనివిధంగా పిఎఫ్‌, ఇఎస్‌ఐ యజ మానులు చెల్లించవలసిన వాటా కూడా కార్మికుల జీతాల నుంచే మినహాయిస్తున్నారని తెలిపారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌ సహా అధికారులు అందరికీ వినతి పత్రాలు సమర్పించినా న్యాయం జరగలేదన్నారు. సిఐటియు నగర అధ్యక్షుడు పలి వెల వీరబాబు మాట్లాడుతూ కృష్ణా కన్స్ట్రక్షన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 2021 జూన్‌ నుండి జిజిహెచ్‌ లో శానిటేషన్‌ కాంట్రాక్టు నిర్వహిస్తుందన్నారు. పిఎఫ్‌, ఇఎస్‌ఐ యజమానులు చెల్లించవలసిన వాటా నెలకు సుమారు రూ.1,400లను కత్తిరించారని,ఆ సొమ్మంతా కార్మికుల ఖాతాలకు జమచేయా లన్నారు. సంక్రాంతి తరువాత దశల వారీగా ఆందోళన చేయడానికి కార్మికులు సిద్ధమవు తున్నారని, జరగబోయే పరిణామాలకు అధికా రులు, కాంట్రాక్టు సంస్థ వారే బాధ్యత వహిం చాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి మలక వెంకట రమణ, యూనియన్‌ నాయకులు జె.శేషు, ఆర్‌.రమేష్‌, ఎస్‌. వాసు, పుష్ప, రమణమ్మ, దుర్గా ప్రసాద్‌, శ్రీకాంత్‌, ఏసు, రవి, వివిఎన్‌ కుమార్‌ పాల్గొన్నారు..

➡️